Kajol : షారూఖ్​ వల్లే ఇండస్ట్రీలో ఉన్న : కాజోల్

Kajol : షారూఖ్​ వల్లే ఇండస్ట్రీలో ఉన్న : కాజోల్
X

బాలీవుడ్ నటి కాజోల్ ప్రస్తుతం దో పట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ కూడా రిలీజైంది. ఈ చిత్రంలో కాజోల్ తొలిసారిగా పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆదిపురుష్ భామ కృతి సనన్ కూడా నటిస్తోంది. తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న కాజోల్ అలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా షారూఖ్ ఖాన్‌తో తనతో చెప్పిన అనుభవాన్ని వివరించింది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే నటనను విడిచి పెట్టాలనుకున్నట్లు కాజోల్ తెలిపింది. నా మూడో సినిమాకే చాలా అలసిపోయినట్లు అనిపించింది.. దీంతో నటనకు గుడ్‌ బై చెప్పాలనుకున్నా అని వెల్లడించింది. కానీ షారూఖ్ ఖాన్ మాటల వల్లే ఇండస్ట్రీలో ఇ‍ప్పటికీ కొనసాగుతున్నానని పేర్కొంది. కాజోల్ మాట్లాడుతూ..' చాలా ఏళ్ల క్రితం ఉధార్ కి జిందగీ అనే సినిమా చేశా. అదే నా మూడో సినిమా. ఆ సమయంలో ఇండస్ట్రీ చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు నా వయసు దాదాపు18 ఏళ్లు ఉంటుంది. నేను ఆ సినిమాను పూర్తి చేశా. ఇప్పటికీ నాకు గుర్తుంది. నీకు నటన తెలుసు.. కానీ మీరు ఇంకా నేర్చుకోవాలి' అని సలహా ఇ‍చ్చారని తెలిపింది. కాగా.. కాజోల్ 1992లో బేఖుడి మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాజీగర్ , కరణ్ అర్జున్ , దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే , గుప్త్ , ఇష్క్ , కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ వంటి హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం దోపట్టి మూవీతో కనిపించనుంది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Tags

Next Story