సినిమా

Kamaan Kalavati: కమాన్ కళావతి.. తమన్ అసంతృప్తి

Kamaan Kalavati: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట చిత్రానికి సంబంధించిన పాట లిరికల్ వీడియో వచ్చేసింది..

Kamaan Kalavati: కమాన్ కళావతి.. తమన్ అసంతృప్తి
X

Kamaan Kalavati: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట చిత్రానికి సంబంధించిన పాట లిరికల్ వీడియో వచ్చేసింది.. కీర్తి సురేష్, మహేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు పరశురామ్.. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్.

ఈ క్రమంలో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు పురస్కరించుకుని కమాన్ కళావతి నువ్ లేకుంటే అధోగతి పాటను విడుదల చేయాలనుకున్నారు యూనిట్ సభ్యులు. అయితే శనివారం రోజే నెట్టింట ఈ పాట హల్ చల్ చేసింది. దాంతో తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాట కోసం దాదాపు ఆరు నెలలు వెచ్చింది.

వెయ్యిమంది కష్టపడి చేసిన పాట ఇది. అంత కష్టాన్ని చిటికెలో నీరుగారుస్తూ పాటకి పని చేసిన ఓ వ్యక్తి లీక్ చేయడం చాలా బాధ కలిగించింది అని ట్విట్టర్‌లో తన ఆవేదనని వ్యక్తం చేశారు. దాంతో చిత్ర బృందం ఒక రోజు ముందుగా ఆదివారమే ఈ పాటని విడుదల చేసింది.

ఈ పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. మాంగళ్యం తంతానానేనా అంటూ మొదలయ్యే ఈ పాటలో మహేష్, కీర్తి మధ్య కెమిస్ట్రీ బావుంది. కల్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి.. కురులా అవీ కళావతీ.. కుళ్లాబొడిసింది చాలు తీ అంటూ కళావతిని కీర్తిస్తూ సాగుతుంది ఈ పాట. మే 12న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే కళావతి పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ తెచ్చిపెడుతోంది.

Next Story

RELATED STORIES