Prabhas Kalki 2 : కల్కి పార్ట్ 2.. ఎప్పటి నుంచో తెలుసా

రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి ఏడి2898 లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. మహా భారతానికి ఫిక్షన్ ను జోడించి నాగ్ అశ్విన్ డైరక్ట్ చేసిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోణ్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ కొంత వరకు డిజప్పాయింట్ అయినా క్లైమాక్స్ తో మళ్లీ హై మూమెంట్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు. కల్కి కలెక్షన్స్ లో బాహుబలిని బీట్ చేస్తుందని భావించారు చాలామంది. బట్ ఆ ఫిగర్స్ ను రీచ్ కాలేకపోయిందీ మూవీ. ఇక ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ కూడా ఉందని అప్పుడే చెప్పాడు దర్శకుడు. కాకపోతే అది ఎప్పుడు అనే ప్రశ్నకు ఇన్నాళ్లుగా ఆన్సర్ లేదు. ఫైనల్ గా నిర్మాత అశ్వనీదత్ కల్కి 2 గురించి కీలకమైన అప్డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉన్నాడు. దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఫౌజీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ స్టార్ట్ కావాల్సి ఉంది. దీంతో కల్కి 2 ఇప్పట్లో సాధ్యం కాదు అనుకున్నారంతా. బట్ కల్కి 2ను ప్రభాస్ నిర్లక్ష్యం చేయలేదు. ఈ చిత్రానికీ డేట్స్ ఇచ్చాడట. ఈ యేడాది జూన్ నుంచి కల్కి 2 సెట్స్ పైకి వెళుతుందని చెప్పాడు అశ్వనీదత్. ఈపార్ట్ 2 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకుంటున్నాడట నాగ్ అశ్విన్. అన్నీ సెట్ కాగానే జూన్ నుంచి సెట్స్ పైకి వెళతారన్నమాట. సో.. 2025 ప్రభాస్ షెడ్యూల్ చాలా అంటే చాలా బిజీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ యేడాది రెండు సినిమాలు విడుదలవుతాయి అని భావించినా.. రాజా సాబ్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఫౌజీ 2026కే అవుతుంది. ఒకవేళ 2026లో రెండు సినిమలు గ్యారెంటీగా వచ్చే అవకాశాలున్నాయనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com