Amitabh Look in 'Kalki 2898 AD' : ప్రభాస్ మూవీ నుంచి అమితాబ్ ఫస్ట్ లుక్

Amitabh Look in Kalki 2898 AD : ప్రభాస్ మూవీ నుంచి అమితాబ్ ఫస్ట్ లుక్
X
'కల్కి' నుంచి అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్

లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న తన 81వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ రోజును ప్రత్యేకంగా రూపొందించడానికి, రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' నిర్మాతలు ఈ సినిమా నుండి ప్రముఖ నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు.

'కల్కి 2898 AD'లో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీతో పాటు పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ రోజు అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మేకర్స్ ఓ స్పెషల్ ట్రీట్ ను అందించారు. ఈ మూవీ నుంచి ఆయన లుక్ ను రివీల్ చేశారు. లుక్ అయితే రివీల్ చేశారు గానీ ఇందులో ఆయన ముఖం మాత్రం కనిపించకుండా మేకర్స్ సీక్రసీ మెయింటైన్ చేశారు. ఈ పోస్టర్ లో కేవలం అమితాబ్ కళ్లు మాత్రమే కనిపిస్తుండగా... చేతిలో విల్లు తరహా ఆయుధం, నుదుట బొట్టు చూస్తుంటే... సాధువులా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ను ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

''మీ ప్రయాణంలో మేము కూడా ఓ భాగం అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది'' అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ అమితాబ్ బచ్చన్ కు బర్త్ డే విషెష్ చెప్పింది. ఇక మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం 'కల్కి 2989 ఏడీ' చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రారంభంలో సంక్రాంతికి విడుదల చేయాలని భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇది అప్పటికి కూడా రావడం కష్టమేననిపిస్తోంది.

Tags

Next Story