Kalyaan Dhev: భర్త కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు.. విషెస్ చెప్పని భార్య శ్రీజ..

Kalyaan Dhev: గత కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో విడాకుల గురించి ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే ఏ ఇద్దరు భార్యాభర్తలు కలిసి కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా లేకపోయినా వెంటనే వారి వ్యక్తిగత జీవితంపై ఆరా తీయడం మొదలుపెట్టేస్తున్నారు నెటిజన్లు. తాజాగా మెగా కూతురు శ్రీజ కూడా విడాకులు తీసుకుంటుందేమో అన్న అనుమానం వైరల్‌గా మారింది. అంతే కాకుండా శ్రీజ, తన భర్త కళ్యాణ్ దేవ్‌ల ప్రవర్తన కూడా ఈ రూమర్స్ నిజమైనేమో అనిపించేలా చేస్తున్నాయి.
మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ.. ఇంతకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్‌ను శ్రీజ కళ్యాణ్‌గా పెట్టింది. కానీ కొన్నాళ్ల క్రితం దానిని శ్రీజ కొణిదెలగా మార్చేసింది. అంతే కాకుండా ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు కూడా కనిపించడం లేదు. దీంతో వీరు కూడా విడాకులు తీసుకుంటున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా భర్త కళ్యాణ్ దేవ్ పుట్టినరోజుకు కూడా శ్రీజ ఎలాంటి పోస్ట్‌ను అప్‌లోడ్ చేయలేదు.
కళ్యాణ్ దేవ్ నాలుగేళ్ల క్రితం తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు. అందుకే తన గురించి కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఈ నటుడు ఇటీవల తన 32వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఆ సందర్భంగా శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ల చిన్న కూతురు నవిష్క.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్ట్‌ను పెట్టింది. కానీ శ్రీజ మాత్రం ఎలాంటి పోస్ట్ కానీ, విషెస్ కానీ చేయలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com