Bimbisara: బింబిసార అప్‌డేట్ వచ్చేసింది.. స్టైలిష్ లుక్‌లో కళ్యాణ్ రామ్..!

Bimbisara: నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బింబిసార.. ఉగాది సందర్భంగా సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.. ఈ మూవీని ఆగస్టు 5 2022న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై రూపోందుతున్న ఈ సినిమాకి వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోగా కల్యాణ్ రామ్ కి ఇది 18వ సినిమా కావడం విశేషం... ఫస్ట్ లుక్ తోనే సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్లుగా కేథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
The date is locked for BIMBISARA to ascend the throne 🔥#Bimbisara grand release on 5th August 💥#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/cFhr62CmCe
— NTR Arts (@NTRArtsOfficial) April 2, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com