Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు

Kalyan Ram :  అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు
X

కళ్యాణ్ రామ్, విజయ శాంతి తల్లి కొడుకులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ అర్జున్’. సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతకు ముందు పెద్దగా ఎవరూ పట్టించుకోని ఈ మూవీ టీజర తర్వాత బిజినెస్ పరంగా చాలా పెద్ద క్రేజ్ కనిపించింది. ఈ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి కదా.. అందుకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మొన్నటి వరకూ ఈ మూవీని జూన్ లో విడుదల చేస్తారేమో అనే టాక్స్ వినిపించాయి. బట్ ఈ సమ్మర్ ను మిస్ చేసుకుంటే అంతకు మించిన తప్పేముందీ. అందుకే ఈ ఏప్రిల్ 18న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అఫీషియల గా ప్రకటించారు.

ఏప్రిల్ 17న తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల 2’విడుదల ఉంది. ఆ తర్వాత రోజు ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందిన సారంగపాణి జాతకం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలతో కళ్యాణ్ రామ్ కు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. అలాగే ఈ రెండు సినిమాల మధ్య కూడా పోటీ ఉండదు. రెండూ భిన్నమైన నేపథ్యాల్లో రూపొందిన సినిమాలు కావడం.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. సో.. పోటీ ఉన్నా.. ఎవరి ఆడియన్స్ వాళ్లకు ఉంటారు. పైగా ఓదెల 2 ముందు రోజే విడుదలవుతోంది కాబట్టి ప్రాబ్లమ్ ఏం ఉండదు. మొత్తంగా కళ్యాణ్ రామ్ కూడా ఈ సమ్మర్ లోనే ఎంటర్టైన్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. రిలీజ్ టైమ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక ప్రమోషన్స్ లో దూకుడు పెంచాలి. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఏదో ఒకదానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు వందశాతం ఉన్నాయి.

Tags

Next Story