Kalyan Ram : కళ్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి

Kalyan Ram :  కళ్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న సినిమా టైటిల్ గా గతంలో రుద్ర అని వినిపించింది. బట్ రుద్ర కాదు.. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం వైజయంతిగా విజయశాంతి నటిస్తుండటమే. యస్.. ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. తను రీ ఎంట్రీ ఇచ్చిన సరిలేరు నీకెవ్వరులో ఆమె ఇమేజ్ ను కరెక్ట్ గా వాడలేద దర్శకుడు. కానీ ఈ సారి తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని ఆ మధ్య వచ్చిన ఆమె బర్త్ డే గ్లింప్స్ చూస్తేనే అర్థమైంది.టైటిల్ ను బట్టి కళ్యాణ్ రామ్ .. విజయశాంతి కొడుకుగా నటిస్తున్నాడు అని తేలిపోయింది. సో.. తల్లి కొడుకుల మధ్య రిలేషన్ ను కూడా కొత్త కోణంలో చూపించబోతున్నారని టాక్. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పా, సునిల్ బలుసు నిర్మిస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ టైటిల్ తో పాటు టీజర్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెబుతున్నారు. సినిమాను వేసవి బరిలో మే 26న విడుదల చేసే అవకాశాలున్నాయి. కళ్యాణ్ రామ్ ఒక హిట్టు కొడితే రెండు మూడు ఫ్లాపులు చూస్తున్నాడు. అయితే ఈ మూవీ అతని కెరీర్ లో ఓ కొత్త మైల్ స్టోన్ గా నిలుస్తుందంటున్నారు. ఆ స్థాయిలో వస్తోంది మూవీ అని ఇండస్ట్రీలో టాక్. ఆ టాక్స్ అన్నీ ఎలా ఉన్నా.. ఈ టైటిల్ మాత్రం బావుందని చెప్పొచ్చు. మరి సన్నాఫ్ సత్యమూర్తిలాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.

Tags

Next Story