Kalyani Priyadarshan : సెంచరీ కొట్టేసిన కళ్యాణి కొత్త లోకా

ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో కంటెంట్ ఉంటే కలెక్షన్స్ వస్తాయని నయనతార ఈ జెనరేషన్ లో ప్రూవ్ చేసింది. ఆ రూల్ లో చాలామంది ట్రై చేసిన ఆమె స్థాయిలో సక్సెస్ కాలేదు. ఫీమేల్ సెంట్రిక్ మాత్రమే కాదు.. ఏకంగా సూపర్ ఉమన్ కేటగిరీతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది కళ్యాణి ప్రియదర్శన్. తెలుగు నుంచే హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ మాలీ బ్యూటీ అన్ని భాషల్లోనూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మళయాలం నుంచే లోకా చాప్టర్ 1 : చంద్ర అనే టైటిల్ తో రూపొందిన సినిమాతో వచ్చింది.
డోమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించడం విశేషం. లోకా అనేది ఫ్రాంఛైజీ మూవీ. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా ఆరు భాగాలుంటాయట. అయితే ఇలాంటివి విజయాన్ని బట్టి ఉంటాయి. అయితే ఈ ఫస్ట్ పార్ట్ కు దేశవ్యాప్తంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఏకంగా ఏడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రంతో పాటే విడుదలైన మోహన్ లాల్ మూవీ ‘హృదయపూర్వమ్’ను కూడా దాటేసి మరీ అదరగొడుతోందీ సినిమా. కేరళలో మొదటి రోజు 2.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఏడవ రోజుకు 7. 40 కోట్లు వచ్చింది. రోజు రోజుకూ వసూళ్లు పెరుగుతూ వస్తున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇటు తెలుగులో కూడా మంచి విజయం సొంతం చేసుకుంది. అందుకే దుల్కర్ ను తీసుకువచ్చి మరీ సక్సెస్ మీట్ నిర్వహించారు. మొత్తంగా 100 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ ఇండియన్ సూపర్ ఉమన్ సినిమాగానూ లోకా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com