Kalyani Priyadarshan : సూపర్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్

Kalyani Priyadarshan :  సూపర్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్
X

తెలుగు సినిమాలతో హీరోయిన్ గా పరిచయమైన మళయాల బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, స్టార్ హీరోయిన్ లిజీ కూతురే కళ్యాణి. టాలీవుడ్ లో అఖిల్ తో హలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం చిత్రాల్లో నటించింది. బట్ ఈ మూడూ పోయాయి. దీంతో అమ్మడిని పక్కన పెట్టింది టాలీవుడ్. అయినా తమిళ్, మళయాలంలో హీరోయిన్ గా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ రెండు భాషల్లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి ‘లోకా - చాప్టర్ 1 : చంద్ర’ మూవీ. ఇదో సూపర్ హీరో మూవీ. అనౌన్స్ మెంట్ నుంచి అందరి అటెన్షన్ ను సంపాదించింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నాడు. డోమినిక్ అరుణ్ దర్శకుడు. ఇవాళ(సోమవారం) దుల్కర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.

లోకా వరల్డ్ ను పరిచయం చేస్తూ .. చంద్ర అనే ఓ సాధారణమైన అమ్మాయి సూపర్ హీరోగా ఎలా మారింది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఆద్యంతం అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటోందీ టీజర్. విజువల్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి. అలాగే నేపథ్య సంగీతంలో వచ్చిన ఇంగ్లీష్ సాంగ్ సినిమాకు ఓ మూడ్ ను క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఈ తరహా మూవీస్ కు ఎలాంటి ఇంటర్డక్షన్ కావాలో ఆ రేంజ్ పరిచయంగా ఈ టీజర్ కనిపిస్తోంది. కళ్యాణికి జోడీగా ప్రేమలు ఫేమ్ నాస్లేన్ నటించాడు. లోకా ఫస్ట్ పార్ట్ అంటే దీనికి కంటిన్యూషన్ గా మరిన్ని భాగాలు ఉంటాయనే కదా అర్థం. మరి అవి ఎన్ని పార్ట్స్ గా వస్తాయో కానీ ప్యాన్ ఇండియా సినిమాగానే అన్ని భాషల్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. మళయాలీల ఫేవరెట్ ఫెస్టివల్ ఓనమ్ సందర్భంగా ఆగస్ట్ 27న లేదా సెప్టెంబర్ 5న విడుదల చేసేలా ఉన్నారు ఈ చిత్రాన్ని.

Tags

Next Story