Kamaal Rashid Khan: 'బాహుబలి'ని మించిన సినిమా తీస్తా: బాలీవుడ్ నటుడు

Kamaal Rashid Khan: బాహుబలిని మించిన సినిమా తీస్తా: బాలీవుడ్ నటుడు
Kamaal Rashid Khan: బాహుబలిపైనే కామెంట్స్ చేశాడు ఓ బాలీవుడ్ నటుడు. దీనికి మించిన సినిమాను తీస్తానంటూ ఛాలెంజ్ చేశాడు.

Kamaal Rashid Khan: బాహుబలి అనే సినిమా కేవలం తెలుగులోనే కాదు ప్రపంచ సినిమాలోనే ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వల్ల రాజమౌళి, ప్రభాస్‌తో పాటు ఎంతోమంది నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. అయితే ఈ సినిమాపైనే కామెంట్స్ చేశాడు ఓ బాలీవుడ్ నటుడు. దీనికి మించిన సినిమాను తీస్తానంటూ ఛాలెంజ్ చేశాడు.

బాలీవుడ్‌లో కూడా నచ్చినట్టు మాట్లాడుతూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసేవారు కొందరు ఉంటారు. అందులో ఒకరే కమల్ ఆర్ ఖాన్. కమల్ ఆర్ ఖాన్. 2006లోనే హీరోగా అడుగుపెట్టినా కూడా కేఆర్‌కేకు బాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇన్నాళ్ల నుండి లేని అటెన్షన్‌ను ఇప్పుడు పొందగలుగుతున్నాడు కేఆర్‌కే. దీనికి కారణం కాంట్రవర్సీ.

ప్రస్తుతం సౌత్ సినిమాలతో పోలీస్తే బాలీవుడ్ చాలా వెనకంజలో ఉంది. ఈ విషయాన్ని ఎందరో బాలీవుడ్ సెలబ్రిటీలు ఓపెన్‌గా ఒప్పుకుంటున్నారు. కానీ కేఆర్‌కే మాత్రం 'ఆర్ఆర్ఆర్'లాంటి సినిమా గురించి సైతం నెగిటివ్‌గా మాట్లాడి సెన్సేషన్‌ను సృష్టించాడు. ఇప్పటికీ ఆ సినిమాను, 'కేజీఎఫ్ 2'ను పోలుస్తూ ట్వీట్లు చేస్తూనే ఉన్నాడు. తాజాగా బాహుబలిపై కూడా కామెంట్స్ చేశాడు కేఆర్‌కే.

2008లో కేఆర్‌కే హీరోగా నటించిన చిత్రమే 'దేశద్రోహి'. ఈ సినిమాపై, ఇందులో కేఆర్‌కే నటనపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత దేశద్రోహి పార్ట్ 2 తెరకెక్కించనున్నాడు కేఆర్‌కే. అది కూడా బాహుబలిని మించేలా తెరకెక్కిస్తానని, ఇది చూసి బాలీవుడ్ వారు సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలి అంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కేఆర్‌కే.

Tags

Next Story