Kamal Haasan : కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్..!

Kamal Haasan : విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు. కమల్‌కు చికిత్సనందిస్తున్న శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ నెల 03న కమల్ ని డిశ్చార్జ్ చేస్తామని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఇటీవల అమెరికా వెళ్లిన కమల్ తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. దీనితో ఆయన వెంటనే చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెపుతున్నారు. 67 ఏళ్ల కమల్ హాసన్ వరుస సినిమాలతో పాటుగా టెలివిజన్ షోలతో బిజీగా ఉన్నారు. తమిళ్ లో బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. ఇక అటు సినిమాల విషయానికి వచ్చేసరికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా, శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు-2' చిత్రాలను చేస్తున్నారు కమల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com