Kamal Hasan : కమల్ హాసన్ మేటర్ అర్థం అయిందా

Kamal Hasan : కమల్ హాసన్ మేటర్ అర్థం అయిందా
X
భారతీయుడు 2 దారుణంగా ఫ్లాప్ కావడంతో థర్డ్ పార్ట్ విషయంలో కమల్ హాసన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారిని కంట్రోల్ చేస్తూ.. తన సినిమాా రిలీజ్ చేసుకోబోతున్నాడు.

ఎన్నో డిఫరెంట్ రోల్స్ తో ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ కమల్ హాసన్ ( Kamal Haasan ). అందుకే ఆయన్ని లోక నాయకుడు అన్నారు. కానీ ఎంత పెద్ద హీరో అయినా తన సినిమాలో కంటెంట్ లేకపోతే కటౌట్స్ ఏం చేయలేవు. ఎన్ని మేకప్ లు వేసుకున్నా.. బాక్సాఫీస్ కు కళ తీసుకు రాలేరు అనేందుకు భారతీయుడు 2 మరో ఎగ్జాంపుల్ గా నిలిచింది. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీతో కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. పైగా ఈ మూవీకి మరో పార్ట్ కూడా ఉందని చెప్పారు. కానీ సెకండ్ పార్ట్ రిజల్ట్ చూసిన తర్వాత 3వ భాగం కూడా చేస్తారంటే ఖచ్చితంగా సాహసం అవుతుంది. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిండా మునిగిపోయింది. అలాంటి వారు మరోసారి శంకర్ ను నమ్మి రిస్క్ చేస్తారని ఎవరూ అనుకోరు. కానీ వాళ్లు రెడీగానే ఉన్నారు. థర్డ్ పార్ట్ కోసం ఎప్పుడంటే అప్పుడు రెడీ అంటున్నారు. అయితే కమల్ హాసన్ కు మేటర అర్థం అయింది. ఈ టైమ్ లో మరో పార్ట్ తో రావడం అంటే మరోసారి అభాసుపాలు కావడమే అనుకుంటున్నాడు. అందుకే లైకా వాళ్లను కొన్నాళ్లు ఆగమని చెప్పాడట.

ప్రస్తుతం కమల్ హాసన్ మణిరత్నం డైరెక్షన్ లో సొంత బ్యానర్ లో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కమల్ కు జోడీగా త్రిష నటిస్తోంది. జయం రవి, శింబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీపైనే పూర్తిగా ఫోకస్ చేయబోతున్నాడు. పైగా భారతీయుడు 3 రావాల్సిన డేట్ లో థగ్ లైఫ్ ను విడుదల చేయాలనుకుంటున్నాడు. ఈ మేరకు లైకా వారిని కూడా ఒప్పించాడట. మొత్తంగా భారతీయుడు 2 ఇచ్చిన షాక్ కమల్ కు గట్టిగానే తగిలింది. ఫస్ట్ పార్ట్ క్లాసిక్ అయితే సెకండ్ పార్ట్ నైట్ మేర్ లా మారింది అతనికి.

Tags

Next Story