Vikram: అప్పులన్నీ తీర్చేస్తా.. మంచి వ్యక్తిగా ఉంటా: కమల్ హాసన్

Vikram: విలక్షణ నటుడు కమల్ హాసన్.. ఆయన నటించిన తాజా చిత్రం విక్రమ్.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.. యువ హీరోలతో పోటీ పడి నటించిన చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కమల్ అద్భుతంగా నటించాడు.
గత నాలుగేళ్లుగా వెండి తెరకు దూరమైనా కమల్ లో నటుడు మాత్రం అలానే ఉన్నాడు.. విక్రమ్ విడుదలైన రెండు వారాల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసింది. ఈ విషయంపై కమల్ చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు.. గతంలో తాను ఇంత మొత్తం సంపాదిస్తానంటే ఎవరూ తన మాటలు నమ్మలేదన్నారు.. ఇప్పుడు సాధించి చూపెట్టానని అన్నారు.
ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు విషయంలో ఇబ్బంది పడకూడదు. ఈ సినిమాకు వచ్చిన డబ్బుతో నా అప్పులన్నీ తీర్చేస్తా.. నాకు ఇష్టమైన ఆహారాన్ని తింటా.. కుటుంబానికి చేతనైనంత ఆర్థిక సాయం చేస్తా.. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయాక ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పేస్తా.. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని సాయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు.. నేను ఒక మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా అని కమల్ తెలిపారు.
ముఖ్యంగా, ఆరు దశాబ్దాల పాటు సాగిన కమల్ కెరీర్‌లో విక్రమ్ బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రం కమల్ హాసన్ 'ఏజెంట్ విక్రమ్'గా నటించిన 1986 హిట్ విక్రమ్‌కి కొనసాగింపు. దీనికి సీక్వెల్ విక్రమ్ 3 కూడా ఉంటుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com