Kamal Haasan : కమలహసన్ కు కరోనా.... ఆసుపత్రిలో చేరిక

Kamal Haasan : విలక్షణ నటుడు కమల్ హసన్ కరోనా బారిన పడ్డాడు.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన కమల్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీనితో పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. 'ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి' అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు కమల్. కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள்.
— Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com