Indian 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన కమల్ హాసన్ ఇండియన్ 2

X
By - Manikanta |9 Aug 2024 2:32 PM IST
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటించిన పాన్ ఇండియా చిత్రం ఇండియన్ 2. బ్లాక్ బస్టర్ హిట్ భారతీయుడుకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది.
భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇండియన్ 2గా ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు కమల్ హాసన్.
ఇండియన్ 2 పాపులర్ డిజిటల్ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఆగస్టు 9 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో భారతీయుడు 2 స్ట్రీమింగ్ అవుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com