ఏడాది వ్యవధిలో విడుదల కానున్న ఇండియన్ పార్ట్ 2&3

ఏడాది వ్యవధిలో విడుదల కానున్న ఇండియన్ పార్ట్ 2&3
ఇండియన్ ఫ్రాంచైజీలపై కీలక అప్డేట్.. 75శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పార్ట్ 3

1996లో విశ్వ నటుడు కమల్ హాసన్, సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'ఇండియన్(భారతీయుడు)' ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది తమిళనాడులోనూ బ్లాక్‌బస్టర్‌ హిట్ అయింది. హిందుస్థానీ పేరుతో హిందీలో డబ్ అయిన ఈ సినిమా ఈ వెర్షన్ లోనూ మంచి విజయం సాధించింది. ప్రాంతీయ అడ్డంకులను అధిగమించిన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన వచ్చిన చిత్రాలలో ఇది ఒకటి. భారతదేశంలో అవినీతిపై అస్త్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సినీ ప్రేమికులు ఇప్పటికీ మర్చిపోరు.

ఇప్పుడు 'ఇండియన్ 2'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్ హాసన్‌.. పాన్ ఇండియా స్థాయిలో అలరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు మూవీపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు ఓ కొత్త అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా తాజా సమాచారం ప్రకారం 'ఇండియన్ 2'తో పాటు 'ఇండియన్ 3'కి కూడా ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 'ఇండియన్ 2'.. 100 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. 'ఇండియన్ 3'.. 75 శాతం ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే, పార్ట్ 2, 3 కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే విడుదల కానున్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా రివీల్ అయింది. ఎన్నో అవాంతరాలను దాటుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓ ఇంటర్నేషనల్‌ సంస్థ దాదాపు రెండొందల కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తమిళ డిజిటల్‌ రైట్స్‌ పరంగా ఇప్పటివరకు ఇదొక రికార్డ్‌ అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇండియన్ ఫ్రాంచైజీలో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయుడు 2 వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

విభిన్నమైన సినిమాలతోపాటు డిఫరెంట్ రోల్స్ చేస్తూ సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోన్న కమల్ హాసన్,. ఇప్పటివరకు సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు, ఇప్పటికే ఆయన 'విక్రమ్'తో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెట్టారు. 'కల్కి 2898 ఏడీ'లో నటిస్తున్న కమల్ హాసన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో ఓ సినిమా చేయనున్నాడని ఇటీవల టాక్ వచ్చింది. దీన్ని 2024లో రిలీజ్ చేయనున్నారని సమాచారం.


Tags

Read MoreRead Less
Next Story