Kamal Haasan : థగ్ లైఫ్ సెన్సార్ పూర్తి .. డ్యూరేషన్ ఎంతంటే..

Kamal Haasan :  థగ్ లైఫ్ సెన్సార్ పూర్తి .. డ్యూరేషన్ ఎంతంటే..
X

కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా థగ్ లైఫ్. మణిరత్నం తెరకెక్కించిన ఈమూవీ జూన్ 5న విడుదల కాబోతోంది. అదే రోజున తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో అంచనాలను భారీగా పెంచారు మేకర్స్. పైగా కమల్, మణి కాంబినేషన్ లో 35యేళ్ల తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఆ ఇద్దరి అభిమానుల్లోనూ ఈ మూవీపై ఓ క్యూరియాసిటీ ఉంది. ఆధిపత్య పోరాటం నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి తను పెంచిన కుర్రాడే తనకు ఎదురు తిరిగి తన స్థానం కోసం ఏకంగా అతనితోనే పోరాటం చేసేలాంటి నేపథ్యం ట్రైలర్ లో కనిపించింది. త్రిష, అభిరామి పాత్రలు సర్ ప్రైజింగ్ గా కనిపిస్తున్నాయి. కాకపోతే మణిరత్నం మ్యాజిక్ అంతా తెరపైనే చూపిస్తాడు. విజువల్స్ తోనూ, మ్యూజిక్ తోనూ, టేకింగ్, మేకింగ్, స్క్రీన్ ప్లే ఇలా అన్ని విషయాలూ తెరపైనే సర్ ప్రైజ చేస్తుంటాడు.

ఇక ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. తమిళనాడులో ఒకే ఒక్క కట్ చెప్పి చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. డ్యూరేషన్ వచ్చి 2 గంటల 45 నిమిషాల 42 సెకన్లు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఉంది కాబట్టి.. ఆ డ్యూరేషన్ పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. కానీ కథ, కథనాల్లో తేడా ఉంటే మాత్రం ఇంత పెద్ద నిడివి సమస్య అయ్యే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా ఏఆర్ రహమాన్ మ్యూజిక్ తో థగ్ లైఫ్ ఇప్పటికైతే భారీ అంచనాలతోనే ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Next Story