Kamal Hassan: మొత్తానికి కమలహాసన్ కూడా వ్యాపారం మొదలుపెట్టేశారుగా..

Kamal Hassan (tv5news.in)

Kamal Hassan (tv5news.in)

Kamal Hassan: సినీ పరిశ్రమలోని నటీనటులు కేవలం సినిమాల్లోనే కాదు.. వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు.

Kamal Hassan: సినీ పరిశ్రమలోని నటీనటులు కేవలం సినిమాల్లోనే కాదు.. వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రతీ యాక్టర్‌కు ఏదో ఒక వ్యాపారం తప్పకుండా ఉంటుంది. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ కూడా హీరోగానే కాకుండా దర్శకుడిగా మైక్రోఫోన్ పట్టుకున్నారు. అంతే కాక పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు వాటికి పూర్తి భిన్నంగా సినిమాలకు సంబంధం లేని ఒక వ్యాపారంలోకి కమల్ అడుగుపెట్టారు.

ఖద్దర్‌ దుస్తులకు మన దేశంలో డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఖద్దర్‌ను ఎక్కువగా ఎవరూ పట్టించుకోకపోయినా.. ఈ మధ్య ప్రభుత్వ ప్రోత్సాహంతో ఖద్దర్‌కు గుర్తింపు లభిస్తోంది. అయితే ఈ ఖద్దర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశ్యంతో కమల్ హాసన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 'కేహెచ్‌ హౌజ్‌ ఆఫ్‌ ఖద్దర్‌' పేరుతో ఈ బ్రాండ్ లాంచ్ అయ్యింది.

ఎప్పుడూ లేనిది కమల్ హాసన్ వ్యాపారం వైపుకు ఎందుకు వెళ్లారు..? అందులోనూ ఖద్దర్ దుస్తుల వ్యాపారాన్నే ఎందుకు ప్రారంభించాలి అనుకుంటున్నారు..? అని ఆయన అభిమానులు సందేహంలో ఉన్నారు. అయితే ఈ సందేహానికి కొంతమంది సమాధానం కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం కమల్.. విక్రమ్, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు అమృత రామ్ అనే తెలుగమ్మాయి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఖద్దర్‌కు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. అలా అమృత వల్ల మెల్లమెల్లగా కమల్‌కు ఖద్దర్ దుస్తులపై ఇష్టం మొదలయ్యిందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా తమిళనాడులో ఎన్నికల సమయంలో కాంచీపురంలో చేనేత కార్మికులకు తనవంతు సాయం చేస్తానని కమల్ మాటిచ్చారు. ఆయన 'కేహెచ్‌ హౌజ్‌ ఆఫ్‌ ఖద్దర్‌' ఆలోచన కూడా అందుకే అని మరికొందరు అంటున్నారు.

'కేహెచ్‌ హౌజ్‌ ఆఫ్‌ ఖద్దర్‌' బిజినెస్‌ను విస్తరించడానికి కమల్ ప్రణాళికలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. దీని ప్రారంభోత్సవం అధికారికంగా అమెరికాలోని చికాగో స్టేట్‌లో జరిగింది. దీనికి పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. దానికంటే ముందు ఈ బ్రాండ్‌పై అందరికీ ఆసక్తి కల్పించడం కోసం ఒక ప్రోమోను తన ట్విటర్‌లో షేర్ చేశారు కమల్.

Tags

Read MoreRead Less
Next Story