Kamal Hassan : అమెరికా బయలుదేరిన కమల్.. ప్రత్యేకంగా దానికోసమే..

X
By - Divya Reddy |28 July 2022 12:00 PM IST
Kamal Hassan : ఇండియన్ 2 మేకోవర్ కోసం కమల్ అమెరికా వెళ్తున్నారు
Kamal Hassan : విక్రమ్ 2 సినిమా గ్రాండ్ సక్సస్.. కమల్‌లో ఎనర్జీని పెంచింది. గత కొంత కాలంగా పెద్ద హిట్ లేకపోవడం వల్ల విక్రమ్ భారీ హిట్‌తో కమల్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే ఉత్సాహాని తన రాబోయే ప్రాజెక్ట్స్‌లో చూపించాలనుకుంటున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాపై కమల్ అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన మేకోవర్ కోసం కమల్ అమెరికా వెళ్లనున్నారు.
సుమారు 3 వారాలపాటు అమెరికాలోనే ఉండి.. అవసరమైన ఫిటినెస్ సంపాదించి తిరిగి భారత్‌కు పయనమవుతారు. ఇండియన్ 2 షూటింగ్ 2020లోనే స్టార్ట్ అయినప్పటికీ కరోనా కారణంగా బ్రేక్ పడింది. తిరిగి ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com