Kamal 'Vikram': యంగ్ హీరో చేతికి కమల్ 'విక్రమ్' తెలుగు రైట్స్..!

Kamal 'Vikram': కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్....ఈ పేర్లు వినగానే ఆడియన్స్ లో వాళ్ళ యాక్టింగ్ టాలెంట్ కళ్ళముందు మెదులుతుంది. అలాంటిది ఆ ముగ్గురూ కలసి సినిమా చేస్తే ఆ అంచనాలు మరో రేంజ్ లో ఉంటాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన విక్రమ్ చిత్రం జూన్ 3న విడుదలవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ ఈ సినిమాని నిర్మించారు.
పాన్ ఇండియా లెవల్లో నాలుగు బాషల్లో వస్తోన్న విక్రమ్ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ ని నితిన్ దక్కించుకున్నాడు. తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థ ద్వారా విక్రమ్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నితిన్ రెడీ అయ్యాడు. దీంతో తెలుగులోనూ విక్రమ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది... ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ భారీగా రిలీజ్ అవుతోంది. సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి.
టాలీవుడ్లో ఇప్పుడు ప్రతి శుక్రవారం అయితే ఓ పెద్ద సినిమా లేదంటే కనీసం రెండు చిన్న సినిమాలు ధియేటర్లలోకి వస్తున్నాయి. ఇదే టైమ్ లో ఓటిటిలో కూడా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. కానీ ఈ శుక్రవారం మాత్రం ఓటిటిలో పెద్ద సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది. ఓ పాన్ ఇండియా మూవీతో పాటు మరో పెద్ద సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.
పాన్ ఇండియా మూవీగా రిలీజై 11 వందల కోట్లు కొల్లగొట్టిన ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. జీ5 ఓటిటిలో నిన్న రాత్రి నుంచి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలోని ఆర్ఆర్ఆర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ముందుగా వంద రూపాయల ఎక్స్ ట్రా పేమెంట్ తో పే ఫర్ వ్యూ విధానంతో ఈ సినిమాని తీసుకురావాలనుకున్నా.... కస్టమర్ల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో జీ5 సంస్థ ఈ విషయంలో వెనక్కి తగ్గింది. నెట్ ఫ్లిక్స్ లో ఇవాల్టి మధ్యాహ్నం నుంచి ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చినా... సక్సెస్ అవ్వలేదు. అందుకే రిలీజైన తక్కువ రోజుల్లోనే ఆచార్యని ఓటిటిలో స్ట్రీమింగ్ కి పెట్టేసింది అమెజాన్ ప్రైమ్ సంస్థ. మరో ఓటిటిలో ఆచార్యకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
వీటితో పాటు నేషనల్ వైడ్ గా సంచలన విజయాన్ని సాధించిన కెజిఎఫ్ చాప్టర్ 2 ఆల్ రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుంది. కాకపోతే 200ల రూపాయల పేమెంట్ తో పే ఫర్ వ్యూ విధానంలో చూడాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఈ మూవీ ధియేటర్లలో ఉంది. ఇక డిస్నీ హాట్ స్టార్ లో భళా తందనాన మూవీ కూడా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీవిష్ణు, క్యాథరన్ హీరో హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాలేదు. దీంతో త్వరగానే ఓటిటిల్లోకి తీసుకొచ్చారు. సో... మొత్తంగా ఈ వారం ఈ సినిమాలన్నీ ఓటిటి వ్యూవర్స్ ముందుకొచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com