Anirudh Ravichandran: కమల్ సర్ నాకు ఎలాంటి గిప్ట్ ఇవ్వలేదు: అనిరుద్
Anirudh Ravichandran: స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని తాజా చిత్రం విక్రమ్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ తమిళ సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొడుతోంది.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కమల్ కోసం అనిరుద్ పనిచేసిన మొదటి ప్రాజెక్ట్ ఇది. అతడు ఈ చిత్రం కోసం అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అందుకే విక్రమ్ సినిమాలోని పాటలు కూడా మంచి హిట్ టాక్ అందుకున్నాయి.
విక్రమ్ సక్సెస్ తర్వాత, కమల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి లెక్సస్ కారు, సూర్యకి రోలెక్స్ వాచ్, సినిమాలోని అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ అపాచీ బైక్‌లను బహుమతిగా ఇచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్‌ను కమల్ నుండి ఎందుకు గిఫ్ట్ తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై అనిరుధ్ స్పందిస్తూ.. ఈ సినిమాలో అవకాశం రావడమే తనకు పెద్ద గిఫ్ట్ అని అన్నారు.
ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే, సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన అనిరుధ్‌కి ఏదైనా బహుమతి ఇవ్వాలని కొంతమంది నెటిజన్లు కమల్ కు పోస్టులు పెడుతున్నారు. మరి ఈ అభ్యర్థనలపై కమల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com