Kangana Ranaut : డిజాస్టర్ గా డిక్లేర్ అయిన ఎమర్జెన్సీ

Kangana Ranaut :  డిజాస్టర్ గా డిక్లేర్ అయిన ఎమర్జెన్సీ
X

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మాతగా, దర్శకురాలిగా తెరకెక్కించిన సినిమా 'ఎమర్జెన్సీ'. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని దేశంలో చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తారు చరిత్రకారులు. అందుకు దారి తీసిన పరిస్థితులు.. ఇందిరా గాంధీ ఒంటెద్దు పోకడలు, నియంతృత్వం గురించి చెబుతూ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తూ కంగనా ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా ట్రైలర్ తోనే తేలిపోయింది.దీంతో ట్రైలర్ కే సినిమాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. చాలా రాష్ట్రాలు ఈ చిత్రాన్ని నిషేధిస్తాం అని ప్రకటించాయి. అదే టైమ్ లో కంగన చేసిన కొన్ని కాంట్రవర్శియల్ కామెంట్స్ వల్ల సెన్సార్ బోర్డ్ నుంచి అప్రూవల్ రాలేదు. ఈ విషయంపై బిజెపి ప్రభుత్వంపైనా విమర్శలు చేసింది కంగనా. తనే నిర్మాత కూడా కావడంతో ఇప్పటికే అనేక అప్పుల భారం మోస్తున్నానని కూడా గతంలో చెప్పింది. అప్పులు తీర్చడం కోసం తన ఇల్లు కూడా అమ్ముకున్నా అనీ చెప్పింది. ఫైనల్ గా అన్ని అడ్డంకులు దాటుకుని గత శుక్రవారం విడుదలైందీ మూవీ.

సినిమాకు కొంత వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కమర్షియల్ గా అనుకున్నంత గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు. అయితే మౌత్ టాక్ వల్ల ఆది వారం రోజు 4 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక సినిమా పికప్ అవుతుందనుకున్న టైమ్ లో సోమవారం పూర్తిగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కేవలం 1 కోటి 4లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో నాలుగు రోజులకు కలిపి కేవలం 11 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా కోసం కంగనా 60కోట్ల వరకూ బడ్జెట్ పెట్టింది. ఆ బడ్జెట్ కు ఈ కలెక్షన్స్ కు ఉన్న తేడా చూస్తే.. కంగనా ఖాతాలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ పడినట్టైంది.

ఇక కంగనతో పాటు ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా ఛౌదరి, మిలింద్ సోమన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఏమాటకామాటే.. ఇందిరగా కంగనా ఎప్పట్లానే అద్భతమైన నటన చూపించింది. ఇందిరను గుర్తుకు తేవడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. అలాగే అంతా అనుకున్నట్టుగా కేవలం నెగెటివ్స్ మాత్రమే కాక ఇందిరలోని గొప్ప గుణాలను కూడా బాగా చూపించిందనే టాక్ వచ్చింది.

Tags

Next Story