Kangana Ranaut: అవును.. మహేష్ అన్నది నిజమే: కంగన కామెంట్స్

Kangana Ranaut: బాలీవుడ్ నన్ను భరించలేదు.. అని సరదాగానో, సీరియస్ గానో అన్న మహేష్ బాబు మాట పెద్ద దుమారమే రేపుతోంది..నటీ నటులు ఆ వాఖ్యలపై స్పందిస్తున్నారు.. కొందరు పాజిటివ్ గా, మరికొందరు నెగిటివ్ గా.. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది. తాను మహేష్ బాబుతో ఏకీభవిస్తున్నానని చెప్పింది.
కంగనా తన కొత్త చిత్రం ధాకడ్ రెండవ ట్రైలర్‌ను విడుదల చేయడానికి ఢిల్లీకి వచ్చింది. ఈ సందర్భంగా మహేష్ బాబును బాలీవుడ్ భరించలేదంటూ చేసిన ప్రకటన గురించి ఆమెను అడిగినప్పుడు, ఆమె వెంటనే స్పందించి అతని ప్రకటనతో ఏకీభవించింది.
ఆమె ఇలా చెప్పింది.. అతను చెప్పింది నిజమే.. నేను దీనితో ఏకీభవిస్తున్నాను. అతడికి బాలీవుడ్ నిర్మాతల నుండి చాలా ఆఫర్‌లు వచ్చాయని నాకు తెలుసు. కానీ వాటిని ఆయన తిరస్కరించాడు. ఆయన తరం నటులు తెలుగు చిత్ర పరిశ్రమను భారతదేశంలోనే నంబర్ వన్ చిత్ర పరిశ్రమగా నిలిపారు. కాబట్టి, బాలీవుడ్ ఖచ్చితంగా అతడిని భరించలేదు.
ఆమె ఇంకా ఇలా చెప్పుకొచ్చింది, "అతడు తన పరిశ్రమ పట్ల చాలా గౌరవంతో ఉంటాడు. తెలుగు చిత్ర పరిశ్రమ గత 10-15 ఏళ్లలో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు ఇతర చిత్ర పరిశ్రమలను కూడా అధిగమించి ముందుకు వెళుతున్నారు. ఈ విషయంలో వారి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు." అని కంగనా తెలిపింది.
తాజాగా, మహేష్ బాబు ప్రెస్ నోట్ ద్వారా, తెలుగు సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నానని తన ప్రకటనపై క్లారిటీ ఇచ్చాడు. తాను అన్ని సినిమాలను ప్రేమిస్తానని, అన్ని భాషలను గౌరవిస్తానని నోట్ లో పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com