Katrina Kaif Vicky Kaushal: విక్కీ, కత్రినా పెళ్లిపై కంగనా షాకింగ్ కామెంట్స్..

Katrina Kaif Vicky Kaushal: కంగన రనౌత్.. బాలీవుడ్ కాంట్రవర్షియల్ క్వీన్.. ఏ విషయాన్ని అయినా కాస్త కొత్త కోణంలో చూడడం కంగనాకు అలవాటు. అందుకే తన మాటలు కూడా తూటాల్లా పేలుతుంటాయి. తన మాటల వల్ల ఇప్పటికీ కంగనా ఎందరినో తన శత్రువుల్లా మలచుకుంది. ఇటీవల బాలీవుడ్‌లో హైలైట్ అవుతున్న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లిపై కూడా కంగనా ఇలాగే డిఫరెంట్‌గా స్పందించింది.
డిసెంబర్ 7న రాజస్థాన్‌లో విక్కీ కౌశల్, కత్రినా పెళ్లి వేడుకలు వైభవంగా జరిగినా కూడా దాని గురించి ఏ ఒక్క సమాచారాన్ని కూడా ఎవరూ బయటికి రానివ్వలేదు. చాలా దగ్గర వారిని మాత్రమే పెళ్లికి పిలిచారు. గెస్ట్ లిస్ట్‌ను కూడా బయటికి రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. చాలావరకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవ్వరూ వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ప్రకటించలేదు. కానీ కంగనా మాత్రం విక్కీ, కత్రినా పెళ్లిపై తన అభిప్రాయం ఏంటో బయటపెట్టింది.
'సక్సెస్, డబ్బు సంపాదించిన తర్వాత మగవారు తమకంటే వయసులో చిన్న అయిన ఆడవారిని పెళ్లి చేసుకుంటారన్న విషయం మనం చాలాసార్లే విన్నాం. ఒకవేళ భార్య.. భర్తకంటే ఎక్కువ సక్సెస్‌ఫుల్ అయినా అది పెద్ద సమస్యలాగా పరిగణించేవారు. కానీ ప్రస్తుతం సక్సెస్, డబ్బు సంపాదించిన సినీ సెలబ్రిటీలు తమకంటే వయసులో చిన్న అయిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం చూస్తుంటే చాలా బాగుంది. ఒక మూఢనమ్మకాన్ని బ్రేక్ చేస్తున్నందుకు ధన్యవాదాలు' అని చెప్తూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. ప్రస్తుతం ఈ స్టోరీ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com