Kangana Ranaut: 'మీరు నాకు హాట్‌గా అనిపించారు'.. నటిపై కంగనా కామెంట్స్..

Kangana Ranaut: బిగ్ బాస్‌లాంటి ఒక సెన్సేషనల్ రియాలిటీ షోను ప్రారంభించి ప్రతీ భాషలో దానిని సూపర్ హిట్ చేసింది బాలీవుడ్. అయితే అదే కాన్సెప్ట్‌తో తాజాగా 'లాక్ అప్' అనే మరో రియాలిటీ షో ప్రారంభమయ్యింది. ఇది కేవలం ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లోనే ప్రసారమవుతోంది. ఇప్పటికే స్ట్రీమింగ్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. లాక్ అప్‌లో ఇటీవల ఓ కంటెస్టెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది హోస్ట కంగనా రనౌత్.
లాక్ అప్‌లో కంటెస్టెంట్స్‌గా ఉన్నవారందరూ ఇంతకు ముందు ఏదో ఒక పెద్ద కాంట్రవర్సీతో సంబంధం ఉన్నవారే. అందుకే ఈ షోలను మరింత ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. అంతే కాకుండా లాక్ అప్ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవాలంటే వారు చేసే టాస్క్‌లు కూడా అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా లాక్ అప్‌లో కంటెస్టెంట్స్ చేసిన ఓ టాస్క్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో లాక్ అప్‌లోని ఒక్కొక్క కంటెస్టెంట్‌కు ఒక్కొక్క రకమైన టాస్క్‌ను ఇచ్చారు. అందులో భాగంగానే నటి పూనమ్ పాండేకు సెడ్యూస్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌కు పూనమ్ పూర్తిస్థాయి న్యాయం చేసింది. ఈ టాస్క్ తాను చేస్తున్నంతసేపు కంటెస్టెంట్స్ అంతా మైమరిచిపోయి చూశారు. ఇదే విషయాన్ని కంగనా కూడా చెప్పింది.
పూనమ్‌ను చాలా బాగా ఆడిందంటూ ప్రశంసించింది కంగనా. చాలా హాట్‌గా కవ్వించి అదరగొట్టిందని తెలిపింది. అంతే కాకుండా పూనమ్‌ను చూస్తుంటే తనకే హాట్‌గా అనిపించిందంటూ కామెంట్ చేసింది కంగనా. 64 కళల్లో సమ్మోహన కళ కూడా ఒకటని, పూనమ్ అందులో ఒక మంచి కళాకారిణి అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అంతే కాకుండా ఈ కళలో తనతో సహా అందరికీ కోచింగ్ ఇవ్వాలని తెలిపింది కంగనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com