Kangana Ranaut: కంగనా రనౌత్‌పై మండిపడ్డ మెట్రోపాలిటన్ కోర్టు.. నిందితురాలు అంటూ..

Kangana Ranaut (tv5news.in)
Kangana Ranaut: బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్.. తన దుడుకుతనంతో ఇప్పటికీ ఎన్నో సమస్యలను తెచ్చుకుంది. తన ప్రవర్తన కొందమందికి నచ్చకపోతే.. కంగనా యాటిట్యూడ్‌కు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బాలీవుడ్‌లో కంగనాలాగా డేరింగ్‌గా మాట్లాడేవారే లేరు అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే కంగనా తన యాటిట్యూడ్ వల్ల కోర్టులో నిందితురాలిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
కంగనా రనౌత్ తనకు ఏ విషయమైనా నచ్చితే.. ఎలా అయితే ధైర్యంగా చెప్తుందో.. తనకు నచ్చకపోతే కూడా అలాగే మొహం మీద చెప్పేస్తుంది. అలాగే 2020 నవంబర్‌లో కంగనా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని జావేద్.. కంగనాపై పరువునష్టం దావా వేశాడు. అయితే ఆ కేసులో కోర్టు హాజరు నుండి శాశ్వత మినహాయింపు కావాలని కోరిన కంగనాకు చుక్కెదురైంది.
మామూలుగా నటీనటులు అంటే సినిమాల షూటింగ్‌లకు సంబంధించి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా బాలీవుడ్‌లోని నటీమణుల్లో తాను కూడా ఒకరని తెలిపి కంగనా కోర్టు హాజరు నుండి శాశ్వత మినహాయింపు కోరింది. కంగనా ఇలా అడగడంతో ఆగ్రహించిన కోర్టు తనను నిందితురాలు అంటూ వ్యాఖ్యానించింది.
కంగనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండొచ్చు కానీ తాను ఓ కేసులో నిందితురాలు అన్న విషయాన్ని మెట్రోపాలిటన్ కోర్టు గుర్తుచేసింది. ఆ విషయాన్ని తను మర్చిపోవద్దని హెచ్చరించింది. ఈ కేసు విషయంలో కంగనా సహకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తోందని కోర్టు మండిపడింది. కంగనా సెలబ్రిటీ అయినా కూడా కోర్టు నిబంధనలు పాటించక తప్పదని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com