Kangana Ranaut : ఆ విషయం చెప్పడానికి బాధగా ఉంది : కంగనా రనౌత్

Kangana Ranaut : ఆ విషయం చెప్పడానికి బాధగా ఉంది : కంగనా రనౌత్
X

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 6న మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా.. మరికొన్ని రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పలు కారణాల వల్ల ఇప్పటికే దీని విడుదల వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ జారీ చేయని కారణంగా మరోసారి ఇది వెనక్కి వెళ్లింది. దీనిపై కంగనా ‘ఎక్స్’లో పోస్ట్‌ పెట్టారు. ఎంతో బాధగా ఉందన్నారు.‘నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ కోసం మేము ఇంకా ఎదురుచూస్తున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. మమ్మల్ని అర్థం చేసుకుంటున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని కంగనా పోస్ట్‌ పెట్టారు. ‘ఎమర్జెన్సీ’ సెన్సార్‌ సర్టిఫికెట్ కోసం బాంబే హైకోర్టును సంప్రదించిన కంగనాకు అక్కడ ఊరట లభించలేదు. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడింది.

Tags

Next Story