Kangana Ranaut : సినిమా రిలీజ్​ కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాడుతా : కంగనా

Kangana Ranaut : సినిమా రిలీజ్​ కోసం ఎక్కడికైనా వెళ్లి పోరాడుతా : కంగనా
X

దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. ఇందులో బాలీవుడ్​ భామ కంగనా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించింది. అయితే ఎమర్జెన్సీ మూవీ షూటింగ్ పూర్తయింది. కానీ కొన్ని కారణాల వల్ల రెండు సార్లు విడుదల వాయిదా పడింది. అయితే ఎమర్జెన్సీని సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి చిక్కుల్లో పడ్డారు. ఇందులోని కొన్ని సీన్స్‌పై పంజాబ్ ఫరీద్ కోట్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలోనూ ఈ సినిమా విడుదల నిషేధం విధించే అవకాశాలున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా కంగనా సినిమా కోసం కోర్టుకు వెళ్లడానికి కూడా రెడీ అని కామెంట్స్ చేసింది. ‘‘మా టీమ్‌తో సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెళ్తే కొందరు డ్రామా క్రియేట్ చేశారు. నేను సెన్సార్ బోర్డును నమ్ముతున్నాను కాబట్టి తొందరలోనే ఎమర్జేన్సీ సెన్సార్ కంప్లీట్ అవుతుందని భావిస్తున్నాను. కానీ వాళ్లు నా సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా లేట్ చేస్తున్నారు. నేను నా చిత్రం కోసం పోరాటం చేయడానికి కోర్టు వరకే కాదు ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది.

Tags

Next Story