Kangana Ranaut: బాలీవుడ్ మూవీ మాఫియాపై కంగనా ఫైర్.. ఇందులో ఆలియా పాత్ర ఏంటి..?

Kangana Ranaut: కంగనా రనౌత్.. తనకు ఏదైనా నచ్చకపోతే వెంటనే మొహం మీదే చెప్పేస్తుంది. అంతే కాకుండా బహిరంగంగా సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాల గురించి బయటపెడుతుంది. అలా చేసే ఎన్నోసార్లు ఈ నటి పలు కాంట్రవర్సీ్ల్లో చిక్కుకుంది. తాజాగా ఆలియా భట్‌పై, తన తండ్రి మహేశ్ భట్‌పై, గంగూబాయి కతియావాడి సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా.
వారసత్వం అనేది ఏ రంగంలో అయినా ఉండేదే.. అలాగే సినీరంగంలో కూడా ఉంది. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో వారసత్వం అనే అంశం పెద్ద చిచ్చునే రేపింది. అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోని సమయంలో కూడా కంగనా వారసత్వంపై బాలీవుడ్‌లో పోరాడింది. అందుకే చాలామంది స్టార్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఆమెను పక్కన పెట్టేశారు. అయితే మరోసారి ఆలియా భట్ విషయంలో ఈ వారసత్వ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది కంగనా.
ఆలియా భట్‌కు తండ్రి చాటు బిడ్డ అని, ఆలియ తండ్రి మహేశ్ భట్‌ను మూవీ మాఫియాకు డాడీ అని పిలిచింది కంగనా. అంతే కాకుండా ఈ శుక్రవారం విడుదల అవుతున్న గంగుబాయి కతియావాడి వల్ల 200 కోట్లు బూడిదలో కలవనున్నాయి అంటోంది. ఆలియా యాక్ట్ చేయగలదని మహేశ్ అనుకుంటున్నాడు కాబట్టే ఇలా జరుగుతుంది అని చెప్పింది కంగనా. అంతే కాకుండా మూవీ మాఫియా చేతిలో పవర్ ఉన్నంతవరకు బాలీవుడ్ ఇలాగే ఉంటుంది అని సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా.
'బాలీవుడ్ మూవీ మాఫియా డాడీ ఒక్కచేతితో ఇండస్ట్రీలోని వర్క్ కల్చర్‌ను మార్చేశాడు. చాలామంది పెద్ద దర్శకులపై అనవరసమైన మానసిక ఒత్తిడి తెచ్చి వారిలోని క్రియేటివిటీని చంపేశాడు. ఈ సినిమా విడుదల తర్వాత ఇదే విషయం మరోసారి ప్రూవ్ అవుతుంది. ప్రేక్షకులు ఆయనను ప్రోత్సహించడం మానేయాలి. ఈ ఫ్రైడే జరగనున్న రిలీజ్‌లో ఆయన చేతిలో ఓ పెద్ద డైరెక్టర్, స్టార్ హీరో కూడా బాధితులే.' అంటూ కంగనా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com