Kangana Ranaut : అలాంటి వ్యక్తి కనిపిస్తే ఆశ్చర్యమే : కంగనా రనౌత్

కంగనా రనౌత్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పడం ఈ భామకు అలవాటు. ఇప్పటికే ఎన్నోసార్లు బాలీవుడ్పై అసంతృప్తితో మాట్లాడిన ఆమె తాజా ఇంటర్వ్యూలోనూ బీ టౌన్ పై హాట్ కామెంట్సే చేశారు. 'నేను బాలీవుడ్కు సెట్ అయ్యే వ్యక్తిని కాదు. అందుకే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు. వాళ్లందరి లైఫ్ స్టైల్ వేరు. నాది వేరు. షూటింగ్స్ లేకపోతే.. మార్నింగ్ జిమ్ చేయడం, మధ్యాహ్నం నిద్రపోవడం, మళ్లీ సాయంత్రం కసరత్తులు చేయడం, టీవీ చూడడం, పడుకోవడం ఇదే వారి దినచర్య. అంతకుమించి వారికేం తెలియదు. అలాంటి వారితో స్నేహం ఎలా చేయగలను? సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎప్పుడూ వాళ్ల డ్రెస్సులు, విలువైన వస్తువుల గురించే మాట్లాడుకుంటుంటారు తప్ప మరో విషయాన్ని పట్టించుకోరు. వీటికి భిన్నంగా ఆలోచించే వ్యక్తి బాలీవుడ్లో కనిపిస్తే ఆశ్చర్యమే. ఇక బాలీవుడ్ పార్టీల్లో వారు మాట్లాడుకునే మాటలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. నా దృష్టిలో బాలీవుడ్ పార్టీలంటే 'ఓ ట్రామా' అంటూ కంగనా చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే.. కంగన త్వరలోనే 'ఎమర్జెన్సీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రమిది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రానున్న ఈ సినిమా సెప్టెంబరు 6నవిడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com