Kangana Ranaut: తనకి పెళ్లి అవకపోవడానికి కారణం వివరించిన కంగన

Kangana Ranaut: తనకి పెళ్లి అవకపోవడానికి కారణం వివరించిన కంగన
Kangana Ranaut: ఈ సందర్భంగా చిత్రం ప్రమోషన్ వేగం పెంచింది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కంగనకు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Kangana Ranaut Marriage: మే 20న కంగన నటించిన ధాకడ్ చిత్రం రిలీజ్ కానుంది.. ఈ సందర్భంగా చిత్రం ప్రమోషన్ వేగం పెంచింది. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న కంగనకు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. మీ తోటి నటీనటుల పెళ్లిళ్లు అయిపోయి పిల్లల్ని కూడా కనేస్తున్నారు కదా అని అడిగితే.. దానికి కారణం నేను అబ్బాయిలను కొట్టేస్తానని అందరూ అనుకుంటారు. మీలాంటి వారు ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం వల్లే నేను ఇంకా పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని చెప్పింది.

ధాఖడ్‌లో ఉన్న అర్జున్ రాంపాల్, నిజ జీవితంలో కంగన ఎలా ఉంటుందో చెప్పారు. "కంగనా అద్భుతమైన నటి. ఆమె ఏం చేసినా పాత్ర కోసమే కానీ నిజజీవితంలో అలా కాదు. నిజ జీవితంలో, ఆమె చాలా సున్నితమైనది, చాలా ప్రేమగలది, దేవుని పట్ల విశ్వాసంతో భయ భక్తులతో ఉంటుంది అని అన్నారు. ప్రతి రోజు యోగా, ప్రాణాయామం చేస్తుంది. నిజానికి ఆమె చాలా సాధారణ వ్యక్తి" అని అర్జున్ చెప్పాడు.

ధాఖడ్ ట్రైలర్ గత నెలలో విడుదలైంది. ఈ చిత్రంలో కంగనా కథానాయికగా నటిస్తుండగా అర్జున్ రాంపాల్ నెగిటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. మే20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story