Kangana On Hijab: 'ధైర్యం చూపించాలనుకుంటే అఫ్గానిస్తాన్‌లో బుర్కా వేసుకోకండి'.. కంగనా హాట్ కామెంట్స్

Kangana On Hijab: కంగనా రనౌత్ అనిపించి మాట్లాడేసి వివాదాలలో చిక్కుకుంటుంది. అయినా భయపడకుండా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎప్పుడు లేనంతగా యువతులు ఈ విషయంలో ఎక్కువగా గొడవకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు దీనిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా కంగనా కూడా దీనిపై స్పందించింది.
ముందుగా కర్నాటకలోని ఒక యూనివర్సిటీలో ప్రారంభమయిన ఈ హిజాబ్ వివాదం మెల్లగా దేశమంతటా వ్యాపించింది. ప్రస్తుతం హిందూ, మిస్లిం మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. అంతే కాకుండా ఇందులో అబ్బాయిలకంటే ఎక్కువగా అమ్మాయిలే ఒకరిని ఒకరు దూషించుకుంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. దీనిపై కంగనా కాస్త భిన్నంగా స్పందించింది.
1973లో ఇరాన్‌లో మహిళలు ఎలా ఉండేవారు. ఇప్పుడు అక్కడ మహిళలు ఎలా ఉన్నారు అని ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్‌ను షేర్ చేసింది కంగనా. అంతే కాకుండా 'మీరు ఒకవేళ ధైర్యాన్ని చూపించానుకుంటే అఫ్గానిస్తాన్‌లో బుర్గా వేసుకోకుండా ఉండండి. స్వేచ్ఛగా బ్రతకడం నేర్చుకోవాలి. మీకు మీరే పంజరంలో ఉండిపోవద్దు' అని క్యాప్షన్ కూడా పెట్టింది కంగనా రనౌత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com