Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్ లో వరదలపై ఆందోళన వ్యక్తం చేసిన కంగన

Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్ లో వరదలపై ఆందోళన వ్యక్తం చేసిన కంగన
హిమాచల్ లో సిస్టమ్ పై విరుచుకుపడ్డ కంగనా రనౌత్

హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడటం, వరదలు వల్ల రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీని వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఈ వరద పరిస్థితుల కారణంగా సుమారు 71 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఈ రాష్ట్రంలో ఇప్పటికే అనేక ఇళ్ళు కూలిపోయాయి. అధిక వర్షపాతం వల్ల వాహనాలు, రోడ్లు కొట్టుకుపోవడంతో ఆకస్మిక వరదలు అక్కడి ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించిందో సోషల్ మీడియాలో అనేక వీడియోలు కూడా కనిపించాయి. ఈ ఘటనలపై హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నటి కంగనా రనౌత్.. రుతుపవనాల అల్లకల్లోలంపై తన ఆందోళనను వ్యక్తం చేసింది.

'అరుదైన విపత్తు'పై స్పందించిన కంగనా.. ప్రదేశ్‌లో 'వ్యవస్థ ఎలా విచ్ఛిన్నమైందో' వెల్లడించింది. “హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రజలు అరుదైన విపత్తును ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, వరదలకు అంతం లేదు. పర్వతాలు ఎక్కడికక్కడ పడిపోతున్నాయి, కూలిపోతున్నాయి. రోజుల తరబడి విద్యుత్, నీరు అందడం లేదు. మొత్తం వ్యవస్థ విచ్ఛిన్నమైంది ... పర్వత ప్రజల క్షేమం కోసం నిరంతరం ప్రార్థిస్తున్నాను" అంటూ కంగనా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో రాసుకువచ్చింది.


అంతకుముందు జూలైలోనూ.. హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించే ప్రణాళికలను విరమించుకోవాలని కంగనా అభిమానులను కోరింది. రాష్ట్రంలోని పరిస్థితి గురించి చెప్పేందుకు ఆమె విపత్తుకు సంబంధించిన కొన్ని క్లిప్‌లను పంచుకుంది. “ముఖ్యమైన సమాచారం: హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లవద్దు …. నిరంతర వర్షాల కారణంగా ఇది హై అలర్ట్‌లో ఉంది... రాబోయే రోజుల్లో అనేక ల్యాండ్‌స్లైడ్‌లు, వరదలతో కూడిన పరిస్థితులు రావచ్చు. దయచేసి ఈ వర్షపు వాతావరణంలో హిమాచల్‌ను సందర్శించకుండా ఉండండి" అని ఆమె తెలిపింది. “హిమాలయాల్లో ప్రస్తుతం పరిస్థితి బాగా లేదు. ఎక్కడి వారు అక్కడే ఉండండి. దయచేసి రిస్క్ చేయడానికి ఇది సరైన సమయం కాదు ”అని ఆమె జోడించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. తాజా నివేదికల ప్రకారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక శిబిరాలు నిర్మించామని, ఇప్పటికే రక్షించిన వారి కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని కాంగ్రా డిప్యూటీ కమిషనర్ నుపిన్ జిందాల్ తెలిపారు. "ఆగస్టు 15న చిక్కుకుపోయిన 800 మంది పౌరులను రక్షించారు. NDRF, భారత సైన్యం, భారత వైమానిక దళం సహాయంతో తదుపరి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి" అని నుపిన్ చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story