Kangana Ranaut: ప్రేమలో పడ్డ కంగనా.. అతడెవరో త్వరలోనే తెలుస్తుంది అంటూ హింట్..

Kangana Ranaut (tv5news.in)

Kangana Ranaut (tv5news.in)

Kangana Ranaut: పురస్కారం కంగనా రానౌత్‌కు దక్కినందుకు కొందరు సోషల్ మీడియాలో నెగిటివిటీని చూపిస్తున్నారు.

Kangana Ranaut: హీరోయిన్లు ఎక్కువగా పెళ్లి విషయంలో తొందరపడరు. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ.. రెండు చేతులా సంపాదించాలి అనుకుంటారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్ కూడా అదే అనుకుంటోంది. ఒకప్పుడు తనకు పలువురు బాలీవుడ్ హీరోలతో రిలేషన్‌షిప్ హిస్టరీ ఉన్నా కూడా ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది. తాజాగా కంగనా తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అయిదు సంవత్సరాల లోపు తాను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని ఫ్యామిలీ లైఫ్ మొదలుపెట్టనుందని కంగనా తెలిపింది. తన లైఫ్‌లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారన్న విషయం కూడా బయటపెట్టేసింది. దాన్ని ప్రేమ అని నేను అనను. కానీ తనతోనే నా వివాహం జరుగుతుంది. తన గురించి వివరాలు మీకు త్వరలోనే తెలుస్తాయని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది కంగనా. దీంతో కంగనాను ప్రేమలో పడేసిన వారు ఎవరో తెలుసుకుందామని బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా ఎప్పుడూ వివాదాల్లో ఉండే కంగనాకు సోషల్ మీడియాలో మరో కొత్త సమస్య ఎదురయ్యింది.

ఒక అవార్డు అందుకోవాలంటే దానికి తగ్గ అర్హత కావాలి.. వారి సేవలు నలుగురికి ఉపయోగపడాలి.. వారి వల్ల నలుగురు సంతోషించాలి.. ఇవన్నీ ఉంటేనే ఒక అవార్డు అందుకోవడానికి ఎవరైనా అర్హులు అవుతారు. అందులోనూ పద్మ అవార్డులంటే దేశంలోనే అత్యంత గొప్ప వ్యక్తులకు అందాల్సిన గౌరవం. అలాంటి పురస్కారం కంగనా రానౌత్‌కు దక్కినందుకు కొందరు సోషల్ మీడియాలో నెగిటివిటీని చూపిస్తున్నారు.

కంగనా రానౌత్ నటనలో చాలా సూపర్. తన నటనకు ప్రత్యేకంగా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ.. వ్యక్తిగతంగా ఆమె చాలా విషయాల్లో కరెక్ట్ కాదు. అలాంటి తనకు పద్మశ్రీ ఎలా ఇస్తారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసలు తాను దేశానికి ఏం చేసిందని పద్మశ్రీ అందుకుంటుంది అని వారి వాదన.

అంతే కాకుండా.. కంగనాను సోనూ సూద్‌తో పోలుస్తున్న ఓ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవైపు సోనూ సూద్ ఫోటో, మరోవైపు పద్మశ్రీ అందుకుంటున్న కంగనా ఫోటోను పెట్టి ఈ ఇద్దరినీ పోల్చారు. సోనూ సూద్.. కోవిడ్ సమయంలో కొన్ని వేలమంది ప్రాణాలు కాపాడడానికి తన రక్తాన్ని దారపోశాడు. ఆయనకు ఐటీ రైడ్స్‌తో సమాధానం చెప్పారు. కంగనా.. ముంబాయ్‌ను పాకిస్థాన్‌తో పోల్చింది. మైనరిటీల గురించి తప్పుగా మాట్లాడడం వల్ల ట్విటర్ సైతం తనను వెలివేసింది. తనకు పద్మశ్రీని అందిస్తున్నారు అని ఈ మీమ్ అర్థం.

కంగనా ఇవేవీ పట్టించుకోకుండా పద్మశ్రీ అందుకోగానే ఎంతో సంతోషంగా దీని గురించి తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. తనకు పద్మశ్రీ రావడంతో కొంతమంది నోళ్లు మూతబడ్డాయి అంటూ తన హేటర్స్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడింది. ఇది నచ్చని నెటిజన్లు ఈ మీమ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story