Kangana Ranaut: దీపికా పదుకొనెపై కంగనా కామెంట్స్.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా..

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చినా, నచ్చకపోయినా.. తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పే వారిలో కంగనా ముందుంటుంది. అందుకే బాలీవుడ్ అంతా ఒకవైపు ఉన్నా తాను మాత్రం నా రూటే సపరేటు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. తాజాగా ఓ జర్నలిస్ట్ దీపికా పదుకొనె గురించి ఓ ప్రశ్న అడగగా.. దానికి కంగనా ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
వెండితెరపై వరుస సినిమాలతో, నేచురల్ యాక్టింగ్‌తో, డిఫరెంట్ స్టోరీ సెలక్షన్‌తో దూసుకుపోతున్న కంగనా.. త్వరలోనే హోస్ట్‌గా కనిపించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మాణంలో 'లాక్ అప్' అనే షోను హోస్ట్ చేయనుంది కంగనా. తాజాగా ఈ షో గురించి తెలియజేయడానికి టీమ్.. ఓ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఇందులో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఫైర్ అయ్యింది కంగనా.
'ఈమధ్య కాలంలో మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి క్యారెక్టర్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె కూడా తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి కామెంట్స్‌తో టార్గెట్చేయబడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటి?' అని ఓ జర్నలిస్ట్ కంగనాను ప్రశ్నించింది.
'ఎవరైతే తమను తాము రక్షించుకోలేరో వారిని నేను రక్షించగలను. కానీ దీపికా తనను తాను రక్షించుకోగలదు. ఆ సామర్థ్యం, ఆ ప్లాట్‌ఫార్మ్ తనకు ఉన్నాయి. తన సినిమాను నేను ఇక్కడ ప్రమోట్ చేయలేను. కూర్చోండి' అన్నారు కంగనా. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోసారి కంగనా తన కామెంట్స్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అనుకుంటున్నారు నెటిజన్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com