Kangana Ranaut: అసలు.. జాతీయ భాష హిందీ కాదు: కంగన కామెంట్స్..

Kangana Ranaut: అజయ్ దేవగణ్-కిచ్చా సుదీప్ ల మధ్య గత కొన్ని రోజులుగా జాతీయ భాష హిందీ అనే అంశంపై ట్విట్టర్ వేదికగా వార్ జరుగుతోంది. మరో ప్రముఖ నటి కంగనా రనౌత్: 'హిందీకి బదులుగా సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి' అని వ్యాఖ్యానించింది. నటి తన రాబోయే చిత్రం 'ధక్కడ్' ట్రైలర్ లాంచ్ సందర్భంగా శుక్రవారం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది.
నటీనటులు అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్‌లకు సంబంధించిన హిందీ వివాదం నేపథ్యంలో, హిందీ కంటే సంస్కృతం పాతదని, సంస్కృతం జాతీయ భాషగా ఉండాలని నటి కంగనా రనౌత్ అన్నారు. అయితే, హిందీని జాతీయ భాషగా తిరస్కరించడం పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
హిందీ భాషా వివాదంపై ఆమె అభిప్రాయాన్నితెలిపిన కంగన, "మొదట మన భాష, మూలాలు, సంస్కృతి గురించి గర్వపడే హక్కు మనందరికీ ఉంది. కానీ మన దేశం సాంస్కృతికంగా, భాషల వారీగా చాలా వైవిధ్యమైనది. కాబట్టి వాటిని తీసుకురావడానికి మనకు ఒక ఉమ్మడి భాష అవసరం.
భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు హిందీని జాతీయ భాషగా చేసారు. నిజానికి హిందీ కంటే తమిళం పాత భాష.కానీ పురాతనమైనది సంస్కృత భాష. కాబట్టి, నా అభిప్రాయం ప్రకారం, సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి కానీ హిందీ కాదు అని కంగనా చెప్పుకొచ్చారు.
"సంస్కృతం కాకుండా హిందీని జాతీయ భాషగా ఎందుకు ఎంచుకున్నారో అనేదానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నందున, మీరు దానిని పాటించకపోతే రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నట్లవుతుందని కంగన వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com