Kangana Ranaut: హీరోయిన్ కంగనా రనౌత్‌పై మరో కేసు.. రైతు నిరసనలపై షాకింగ్ కామెంట్స్..

Kangana Ranaut (tv5news.in)
Kangana Ranaut: బోల్డ్‌గా, ఎవరు ఏమనుకున్నా.. అనిపించింది చెప్పేసే మనుషులు చాలా తక్కువమంది ఉంటారు. సినీ పరిశ్రమలో ఇలాంటి వారు కనిపించడం చాలా అరుదు. అలాంటి వారిలో ఒకరే నటి కంగనా రనౌత్. ఏ సమస్యపై అయినా తనదైన రీతిలో స్పందిస్తూ కంగనా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అంతే కాకుండా తనకు అవసరం లేని విషయాల్లో కూడా స్పందిస్తూ ఏరికోరి సమస్యలను తెచ్చుకుంటుంది. తాజాగా కంగనా మరో సమస్యలో ఇరుక్కుంది.
సాగు చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు దాదాపు సంవత్సరం నుండి నిరసనలు చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వారి నిరసనలకు తలొంచింది. సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చింది. ఇది విన్న రైతులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా సాగుచట్టాల రద్దుపై స్పందించారు. అలాగే కంగనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది.
ఢిల్లీ సరిహద్దులో ఏకధాటిగా నిరసనలు చేస్తున్న కాళిస్తానీలతో పోలుస్తూ పోస్ట్ పెట్టింది. ఇది నచ్చని సిక్ మతస్థులు తనపై కేసు నమోదు చేయించారు. సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్‌లో కంగనాపై కేసు నమోదయ్యింది. పలువురు సిక్ మత పెద్దలు కలిసి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు కూడా సాగు చట్టాల రద్దు సరికాదు అంటూ కామెంట్స్ చేసింది కంగనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com