Kangana Vs Javed Aktar: కంగన కౌంటర్ ఫిర్యాదు, సమన్లు జారీ

గీత రచయిత జావేద్ అక్తర్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య వివాదం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జావేద్ అక్తర్‌పై రనౌత్ కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అతనికి సమన్లు జారీ చేసింది.
జావేద్ అక్తర్, కంగనా రనౌత్ మధ్య 2020 నుంచీ గొడవ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ తనను, తన సోదరిని ఇంటికి ఆహ్వానించిబెదిరింపులకు పాల్పడ్డాడని కంగనా ఆరోపించింది. దీంతో ఐపీసీలోని సంబంధిత నిబంధనల ప్రకారం రనౌత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్తర్ అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేశారు. కంగన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేసిందని, ఇది అతని ప్రతిష్టను దెబ్బతీసిందని అక్తర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తర్వాత బాలీవుడ్‌లో ఉన్న "కోటరి" వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ రనౌత్.. తన పేరును లాగారని అందులో పేర్కొన్నాడు.
హృతిక్ రోషన్‌తో తనకున్న సంబంధం గురించి మాట్లాడవద్దని అక్తర్ తనను బెదిరించాడని కంగన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఆమె చేసిన ఈ ప్రకటనలన్నింటికీ లక్షల్లో వీక్షణలు వచ్చాయని, దీంతో తన ప్రతిష్ట మసకబారిందని అక్తర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తాజాగా జావేద్‌పై కంగనా అదే కోర్టులో కౌంటర్-ఫిర్యాదు దాఖలు చేసింది. తనను, తన సోదరి రంగోలీని ఉద్దేశపూర్వకంగానే తన ఇంటికి పిలిపించి, ఆపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com