Kangana Ranuth: అలా చేయొద్దు ప్లీజ్..: అల్లు అర్జున్, యశ్‌లకు కంగన సలహా..

Kangana Ranuth: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సౌత్ స్టార్స్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, కన్నడ సూపర్ స్టార్ యశ్‌లకు సలహాలిస్తోంది. మీరు దక్షిణాదిలో పేరున్న మంచి నటులు.. సినిమాని ప్రేమిస్తారు.. అలానే కుటుంబ భాంధవ్యాలకు విలువిస్తారు.. భార్య బిడ్డలను బాగా చూసుకుంటారు.. అలాంటి మీరు ప్రలోభాలకు లొంగి బాలీవుడ్ వైపు రాకండి.. ఇక్కడ మీరు ఊహించినంత అందంగా ఉండదు అని అల్లు అర్జున్‌కి, యశ్‌లకు బాలీవుడ్‌కి రావొద్దని హితబోధ చేస్తోంది.
బాలీవుడ్ కల్చర్, నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కంగనా తాజాగా మరోసారి ఇండస్ట్రీపై విరుచుకుపడింది. బాలీవుడ్ మిమ్మల్ని పాడుచేయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వాటికి లొంగకండి అని తనదైన స్టైల్లో సలహా ఇచ్చింది.
డమహిళా పైలెట్ ప్రధానాంశంగా 'తేజస్' చిత్రం త్వరలో తెరకెక్కనుంది. బాహ్య శక్తుల నుండి మన దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో మహిళా పైలట్లు ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారనే దానిపై ఈ చిత్ర కథ ఆధారపడి ఉంటుంది. ఇది దేశంలోని వీర జవాన్లకు నివాళి అని కంగన పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com