Kangana Ranaut : ఆగస్టు 14న కంగనా ఎమర్జెన్సీ ట్రైలర్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ ఈనెల 14న విడుదల కానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందిర పాత్రలో కంగనా కనిపించనుండగా మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. మణికర్ణిక ప్రొడక్షన్‌పై ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగనా రనౌత్ నిర్మించారు. ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు ఆమె చెప్పారు. భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com