Kanguva : ఆక్టోబర్ 26న ‘కంగువా’ ఆడియో రిలీజ్

Kanguva : ఆక్టోబర్ 26న ‘కంగువా’ ఆడియో రిలీజ్
X

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కింది. పాన్ ఇండియా బాషలలో అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. సూర్య సరసన దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ కంగువ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ముంబై లో కంగువ టీమ్ మీడియాతో ముచ్చటిం,ఆనే. ఇక, అక్టోబర్ 26న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్టు వీడియో రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిదిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Next Story