రిలీజ్ కు ముందు కంగువ టీమ్ లో విషాదం

సూర్య, దిశా పటానీ జంటగా నటించిన కంగువ నవంబర్ 14న విడుదల కాబోతోంది. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ లో టీమ్ అంతా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తోంది. ఈ టైమ్ లో ఈ మూవీ ఎడిటర్ అనుమానాస్పద రీతిలో మరణించడం అందరికీ షాక్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ ఆనందాన్ని చూడకుండానే ఎడిటర్ నిషాద్ యూసఫ్ ( 43) కేరళ రాష్ట్రం కొచ్చిలోని పనంపిల్లి నగర్ లో తన ఇంట్లోనే మరణించాడు. అయితే అతను ఎలా మరణించాడు అని పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.
మోస్ట్ టాలెంటెడ్ ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న నిషాద్ మాలీవుడ్ లోనే తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఆపరేషన్ జావా, ఒన్, ఉడాల్, ఎగ్జిట్, సౌదీ వెల్లక్కా వంటి పలు విజయవంతమైన చిత్రాలకు ఎడిటర్ పనిచేశాడు. తల్లమాల అనే మళయాల చిత్రానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎడిటర్ గా అవార్డ్ ను కూడా అందుకున్నాడు.
నిషాద్ అనుమానాస్పద మరణంపై వీలైనంత త్వరలోనే ఓ స్పష్టత రావాలని కోరుకుందాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com