Suriya : భారతీయుడు 2 కంటే దారుణంగా కంగువ

Suriya :  భారతీయుడు 2 కంటే దారుణంగా కంగువ
X

ఏ సినిమా అయినా బాగా లేకపోతే బాగా లేదని రివ్యూస్ చెప్పడం కామన్. ఇంకొంతమంది పబ్లిక్ బైట్స్ లో బాగాలేకున్నా.. బావుంది.. అదిరిపోయింది అని చెప్పడమూ రొటీన్ అయిపోయింది. బట్.. ఒక మూవీ నచ్చలేదని సదరు దర్శకుడిని తిట్టడం టెక్నీషియన్స్ ను తిట్టడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇప్పుడు కంగువా విషయంలో అది కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన కంగువాకు మొదటి ఆట నుంచే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఇది కలెక్షన్స్ దారుణమైన ప్రభావం చూపించింది. ఎంతలా అంటే ఇంత కంటే డిజాస్టర్ అనిపించుకున్న భారతీయుడు 2 కలెక్షన్స్ ను కూడా అందుకోలేకపోయింది. అసలు నిర్మాత జ్ఞానవేల్ రాజా అయితే తమ సినిమా ఏకంగా 2000 వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని ఊదరగొట్టాడు. అంతే కాదు.. ఫస్ట్ డే 100 కోట్లు పై మాటే అన్నాడు. తీరా చూస్తే అసలు ఓవరాల్ కూడా కంగువా 100 కోట్లు కొట్టేలా లేదు. అలా ఉంది గ్రౌండ్ లెవల్ పరిస్థితి.

కంగువా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే 24 కోట్ల వరకు మాత్రమే సాధించింది. అదే భారతీయుడు 26 కోట్లు కొల్లగొట్టింది. కానీ ఆ మూవీ టైమ్ లో రిలీజ్ కు ముందు నుంచే నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఇటు కంగువా విషయంలో అదేం లేదు. కాకపోతే కాస్త తక్కువ థియేటర్స్ ఉన్నాయి. అయినా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డల్ గానే కనిపించాయి. ఆశ్చర్యంగా తమిళనాడులో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా కనిపించాయి. దీనికి తోడు అమరన్ స్ట్రాంగ్ గా ఉండటం కూడా కంగువాకు మైనస్ అయింది. లేదంటే ఆ థియేటర్స్ కూడా ఈ మూవీకి వచ్చేవి. ఇప్పుడు కంగువా డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. సో.. ఇది అమరన్ కు అనుకోని అడ్వాంటేజ్ గా మారబోతోంది. ఏదేమైనా అప్పుడు నిర్మాత చెప్పిన 2 వేల కోట్లు అనే మాటలు ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నాయి. అందుకే అంటారు.. దేనికీ అతి పనికిరాదు అని.

Tags

Next Story