Suriya : మగధీర, సెవెంత్ సెన్స్ లా కనిపిస్తోన్న కంగువా

Suriya :  మగధీర, సెవెంత్ సెన్స్ లా కనిపిస్తోన్న కంగువా
X

కోలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శివ అండ్ టీమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ప్యాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు సూర్య. పీరియాడిక్ ఫిక్షన్ స్టోరీగా ఈ మూవీ రాబోతోందని చెబుతున్నారు. చాలా శతాబ్దాల క్రితం ఐదు తెగల మధ్య ఆధిపత్య పోరాటం కనిపిస్తోంది. అందులో ఓ తెగకు నాయకుడైన ‘కంగు’మిగతా అందర్నీ ఓడిస్తాడు అనుకునే టైమ్ లో అనూహ్యంగా ఓ ద్రోహి కారణంగా మరణిస్తాడు. కట్ చేస్తే కథ ఈ కాలానికి వస్తుంది. కంగు మళ్లీ పుడతాడు. అతని శతృవు కూడా మళ్లీ పుడతాడు. ఆ శతృవును అంతం చేసేందుకు కంగు వారసుడి వేట కొనసాగిస్తూ.. ఆ వారసుడి సాయంతో ఈ జన్మలో పగ తీర్చుకోవాలనుకుంటారు. అది నెక్ట్స్ పార్ట్ లో కనిపిస్తుందట.

సో.. చూస్తుంటే పగ తీర్చుకోవడం కోసం మళ్లీ పుట్టడం అనే కాన్సెప్ట్ మగధీర నుంచి కనిపిస్తోంది. అలాగే తన వారసుడి వేటలో జెనెటిక్ థింగ్స్ తో వెదుకులాడటం సెవెంత్ సెన్స్ ను తలపిస్తోంది. అసలు ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయి అంటే.. రెండో ట్రైలర్ వచ్చింది కాబట్టి. ఈ సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత చాలామందిలో అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. ఆ షాట్స్ కూడా ఈ రెండు సినిమాల్లో చూసినట్టుగానే కనిపిస్తుండటంతో మరింత అనుమానిస్తున్నారు. దర్శకుడుగా శివ ఇప్పటి వరకూ రొటీన్ కమర్షియల్ సినిమాలే చేశాడు. ఈ రేంజ్ స్పాన్ ఉన్న మూవీని హ్యాండిల్ చేయాలని అజిత్ హీరోగా నటించిన విశ్వాసం మూవీతో ప్రయత్నించి విశ్వాసం కోల్పోయాడు. మరి ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమాను ఆడియన్స్ కు ఎంగేజింగ్ గా చెప్పగలిగితే ఇలాంటి డౌట్స్ అన్నీ అంతా మర్చిపోతారు. ఏదేమైనా రెండో ట్రైలర్ కంగువాకు మైనస్ కాబోతోందనే కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Tags

Next Story