Suriya Kanguva : సూర్య నిర్మాత కాన్ఫిడెన్స్ అంతా కాసులపైనేనా..

Suriya Kanguva :  సూర్య నిర్మాత కాన్ఫిడెన్స్ అంతా కాసులపైనేనా..
X

స్టార్ హీరో సూర్య నటించిన సినిమా కంగువ. శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. దిశా పఠాని కథానాయికగా నటించింది. ఈ దసరాకు విడుదల అని చెప్పి తర్వాత నవంబర్ 14కి పోస్ట్ పోన్ చేశారీ చిత్రాన్ని. సూర్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ అలాగే.. ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమాగానూ చెబుతున్నారు. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ చూస్తే స్టోరీ స్పాన్ చాలా పెద్దదే అన్నట్టుగా ఉంది. పీరియాడిక్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో పాటు కరెంట్ టైమ్ లో కూడా కొంత భాగం సినిమా ఉంటుందని టాక్. ఇక ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి సూర్య కూడా ప్రమోషన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి ఉన్నాడంటున్నారు. ఆల్రెడీ నార్త్ బెల్ట్ కు సంబంధించి ముంబైలో ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

కంగువ ఫస్ట్ రిలీజ్ డేట్ టైమ్ నుంచి నిర్మాత జ్ఞానవేల్ కాన్ఫిడెన్స్ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.. అలాగే కాస్త ఓవర్ యాక్షన్ లానూ అనిపిస్తోంది. ఎంత సేపూ.. ఈ మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అదే పనిగా చెబుతూ వస్తున్నాడు జ్ఞానవేల్ రాజా. నిజానికి నిర్మాతలు సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడం సహజం.. లాభాలు రావాలని ఆశించడం హక్కు. బట్ ఇన్ని కలెక్షన్లు వస్తాయని ఊహించడం కాస్త అతిశయోక్తిలా అనిపిస్తోంది. సూర్య తమిళ్ లో స్టార్. తెలుగు వారికి బానే తెలుసు. బట్ నార్త్ లో అతనికంటే క్రేజ్ లేదు. ఏమైనా ఉంటే.. జ్యోతిక భర్తగా కొంత పేరుండొచ్చు. బట్ అతని బ్లాక్ బస్టర్ మూవీస్ గజిని, ఆకాశం నీ హద్దురా వంటి మూవీస్ అక్కడ రీమేక్ అయ్యాయి కాబట్టి ఈ రిఫరెన్స్ లు చెప్పొచ్చు.

కలెక్షన్స్ అనేవి కంటెంట్ పై మాత్రమే డిపెండ్ అయి ఉండవు. ఇమేజ్, క్రేజ్, రేంజ్ ను బట్టి కూడా ఉంటాయి. పైగా ఈ దర్శకుడు కూడా కేవలం తమిళ్ లోనే స్టార్.ఇవన్నీ ప్యాన్ ఇండియా రికార్డులకు కొంత ప్రతికూలాంశాలే. అయినా తమ సినిమా 2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత ఘంటపథంగా చెప్పుకోవడం సినిమాపైనే అనుమానాలు పెంచుతాయి తప్ప.. అతని కాన్ఫిడెన్స్ అనిపించదు. ఇంతకు మించిన బిల్డప్, అంచనాలతో ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ మూవీస్ అయిన సాహో, సలార్ లకే అంత కలెక్షన్స్ లేవు. మరి ఈయన నమ్మకం ఏంటో కానీ.. ప్రస్తుతం ముంబైలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

Tags

Next Story