Kanguva Review : రివ్యూ : కంగువా

Kanguva Review :  రివ్యూ : కంగువా
X

రివ్యూ : కంగువా

తారాగణం : సూర్య, బాబీ డియోల్, దిషా పటానీ, కరుణాస్, యోగి బాబు తదితరులు

ఎడిటింగ్ : నిషాద్ యూసఫ్

సినిమాటోగ్రఫీ : వెట్రి పళనిస్వామి

నిర్మాత : కే.ఇ. జ్ఞానవేల్ రాజా

దర్శకత్వం : శివ

కంగువా.. ఈ మధ్య మోస్ట్ అవెటెడ్ మూవీ ఆఫ్ ఇండియా అన్నంత హడావిడీ చేశారు. భారీ ఎత్తు ప్రమోషన్స్ అయ్యియి. ఇది కోలీవుడ్ కు బాహుబలి అవుతుందన్న ప్రచారం కూడా జరిగింది. ఇటు తెలుగులో కూడా గట్టి అంచనాలే ఉన్నాయి. మరి ఈ రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన ఈ మూవీ ఆ రేంజ్ లో ఉందా లేదా అనేది చూద్దాం.

1050ల కాలం. రోమన్ సామ్రాజ్యం నుంచి కొందరు భారత సముద్ర జలాల్లోకి వస్తారు. వారికి ఒక సేఫ్ షెల్టర్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ ప్రాంతంలో ఐదు కోనలలో ఐదు తెగల వాళ్లు ఉన్నారని.. ఆ తెగల్లో ప్రణవకోనను సేఫ్ అనుకుంటారు. కానీ అక్కడి నాయకుడు కంగు(సూర్య)తో పోరాటం సులువు కాదని ఇతర కోనల వారి సహాయం తీసుకుంటారు. ఆ క్రమంలో వచ్చిన ఒక కోన నాయకుడు మోసం చేసి ప్రణవ కోన సైనికులను చంపేస్తాడు. తర్వాత అప్రమత్తమైన కంగు మరోసారి ఆ మోసం జరగకుండా ఆ తెగ నాయకుడిని సజీవ దహనం చేస్తాడు. అతని కొడుకు అది చూసి భయంతో వణికిపోతుంటే.. ఆ కుర్రాడిని తన కొడుకులా చూసుకుంటా అంటాడు కంగు. మరోవైపు 2024 కాలంలో జర్మనీలో జెటా అనే బాలుడిపై బయో మెడికల్ టెస్ట్ లు జరుగుతుంటాయి. అక్కడి నుంచి తప్పించుకున్న కుర్రాడు ఫ్రాన్సిస్( సూర్య)న చేరతాడు. ఈ ఇద్దరూ కలిసినప్పుడు వారికి పాత జ్ఞాపకాలేవో గుర్తొస్తాయి. అటు ప్రణవ కోనన పై కపాల కోన నాయకుడు (బాబీడియోల్) దాడి చేస్తాడు. ఆ దాడిలో కంగువా తను అత్యంత ఇష్టంగా చూసుకున్న కుర్రాడిని పోగొట్టుకుంటాడు. మరి ఈ కుర్రాడెవరు..? జెటాకి అతనికి ఉన్న సంబంధం ఏంటీ...? అసలు తెగల మధ్య తగువులకు కారణం ఏంటీ అనేది తెరపై చూడాలి.

ప్యాన్ ఇండియా కథ అంటే యూనివర్సల్ అప్పీల్ ఉండాలి. కథలో దమ్ముండాలి. కథనం కట్టిపడేసేలా ఉండాలి. ఇవేవీ లేకుండా కేవలం ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే వర్కవుట్ అవదు అని కంగువా నిరూపించుకుంది. అస్సలే మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలకు తోడు.. విపరీతమైన మేకప్ తో ఎవరినీ గుర్తు పట్టలేనంత భీకరంగా చూపిస్తూ.. ఏ పాత్రకూ సరైన జస్టిఫికేషన్ లేకుండా రాసుకున్నాడు శివ. ముఖ్యంగా కంగు, ఫ్రాన్సిస్ పాత్రలు ఎప్పుడూ తిన్నగా మాట్లాడవు. ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న వ్యక్తిని పిలిచినంత బిగ్గరగా కేకలు వేస్తూ చెప్పే డైలాగ్స్ కర్ణభేరిని కకావికలం చేస్తాయి. అసలా డైలాగ్స్ కూడా రిజిస్టర్ కావు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ గోవా ఎపిసోడ్ చూస్తే.. సూర్య లాంటి స్టార్.. ఇంత సిల్లీ సీన్స్ కు ఎలా ఒప్పుకున్నాడా అనిపిస్తుంది. కోలీవుడ్ కు చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ ఈపార్ట్ ను అత్యంత ఇమెచ్యూర్ గా రాసుకున్నాడు.. తీశాడు.

సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చీకటి కోన ఎపిసోడ్స్ తో పాటు హిమ కోనలో ఆడవారి ఫైటింగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్.. ఇలా డిఫరెంట్ ఎపిసోడ్స్ గా ఇవి మెప్పిస్తాయి. బట్ ఓవరాల్ గా చూస్తే.. విపరీతమైన లౌడ్ సౌండ్స్ తో విసిగించి కంగారు పుట్టిస్తాడు కంగువా.

నటన పరంగా సూర్య గెటప్ తప్ప నటనలో ఏ వైవిధ్యం లేదు. అసలు నటుడికి పని చెప్పే పాత్రే కాదిది. పైగా ఫ్రాన్సిస్ గా మాత్రం బాగా చిరాకు పెట్టాడు. దిశా పటానీ పొట్టి డ్రెస్ లతో అలరించినా తన పాత్రకు ఏ ప్రత్యేకతా లేదు. యోగిబాబు కామెడీ అస్సలు పేలలేదు. జెటాగా నటించిన కుర్రాడు బాగా చేశాడు. అతని పేరెంట్స్ లో నటరాజ సుబ్రహ్మణ్యం ఆకట్టుకుంటాడు. ఇతర పాత్రలన్నీ వృథాగానే కనిపిస్తాయి. ఏ పాత్రకూ సరైన జస్టిఫికేషన్ లేదు. బాబీ డియోల్ విలనీ వేస్ట్ అయిపోయింది.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. బట్ నేపథ్య సంగీతం విపరీతమైన సౌండ్ తో తలనొప్పి తెప్పిచింది. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో చాలా కట్స్ అవసరం పడతాయి. డైలాగ్స్ బాలేదు. ఈ మధ్య కాలంలో చూసిన వెరీ బ్యాడ్ డబ్బింగ్ ఈ సినిమాలోనే కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నా.. డైరెక్టర్ థాట్స్ పూర్ గా ఉన్నాయి. బ్యాడ్ రైటింగ్ అండ్ మేకింగ్. ఇది పూర్తిగా దర్శకుడి తప్పిదం.

ఫైనల్ గా : కంగువా.. దూరంగా ఉంటే బెటర్

రేటింగ్ : 2/5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story