Suriya : కంగువా ట్రైలర్.. మాసివ్ రివెంజ్ డ్రామా

సూర్య హీరోగా శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కంగువా. ఈ మూవీ టైటిల్ తో పాటు సూర్య గెటప్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ గానే ఉంటోంది. వైవిధ్యమైన కథతో పాటు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ మూవీగా రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు డబుల్ అవుతాయనే చెప్పాలి. ఓ రేంజ్ లో కట్ చేశారు. బట్ కంటెంట్ పరంగా చూస్తే రెగ్యులర్ రివెంజ్ డ్రామాలానే కనిపిస్తోంది. దానికి ఎంచుకున్న నేపథ్యం ఎక్కువగా ప్లస్ అవుతుండొచ్చు. సూర్య ట్రైబల్ లీడర్ గా కనిపిస్తున్నాడు. గిరిజనులను నీచంగా చూస్తోన్న వారిపై వీరు ఎదురుదాడి చేయడం అనే పాయింట్ ఎక్కువగా హైలెట్ అవుతోంది.
'మనం నివసిస్తోన్న ఈ దీవిలో ఎన్నో రహస్యాలున్నాయి.. వాటన్నికన్నా మనది అంతు చిక్కని రహస్యం.. ' అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆద్యంతం విజువల్ ఫీస్ట్ లా కనిపిస్తోంది. కలర్ టోన్ నుంచి బ్యాక్ డ్రాప్ వరకూ అంతా కొత్తగా కనిపిస్తున్నాయి. కొన్ని షాట్స్ ట్రైలర్ లోనే గూస్ బంప్స్ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా సముద్రం నేపథ్యంలో వచ్చిన ప్రతి షాట్ ఆకట్టుకుంటోంది. సూర్య ఏనుగు దంతాలను చేతికి ఆయుధాలుగా మలచుకుని చేసే యాక్షన్ ఎపిసోడ్ తో పాటు చివర్లో మొసలిని చంపి పడేసే సీన్ సినిమా మరో రేంజ్ లో ఉండబోతోందని తెలియజేస్తోంది. విలన్ గా బాబీ డియోల్ మరోసారి సినిమాకే హైలెట్ గా కనిపించబోతున్నాడని అర్థం అవుతోంది.
కాకపోతే మొత్తం ట్రైలర్ లో హీరోయిన్ దిశాపటానికి సంబంధించిన షాట్ ఒక్కటి కూడా లేకపోవడం.. అసలు ఆమె సినిమాలో ఉందా అనే డౌట్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఓ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీలో హీరోయిన్ ఫేస్ కూడా లేకుండా ట్రైలర్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా కనిపిస్తోంది. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బెస్ట్ క్వాలిటీతో కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీతో పాటు దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ ది బెస్ట్ అనేలా ఉన్నాయి.
దర్శకుడు శివ ఇప్పటి వరకూ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సారి రాబోతున్నాడు అని అర్థం అవుతోంది. ఓ కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేశాడు. కథ, కథనాలు కరెక్ట్ గా ఉంటే ఆ ప్రపంచంలోకి ఆడియన్స్ ను కూడా తీసుకువెళ్లగలడు శివ. మరి ఆ రేంజ్ లోనే సినిమా ఉంటుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com