Kanika Kapoor : రెండో పెళ్లి చేసుకున్న పుష్ప సింగర్..!

Kanika Kapoor : బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ హతిరమనిని ఆమె వివాహం చేసుకుంది. లండన్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో శుక్రవారం జరిగిన ఈ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులతో పాటుగా అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.
ఈ వేడుకల్లో రామ్‌చరణ్ సతీమణి, కనిక స్నేహితురాలు ఉపాసన పాల్గొని సందడి చేశారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కనికా కపూర్ మొదట 18 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాజ్ చందోక్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఆయనా, సమర, యువరాజ్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి తన పిల్లల బాధ్యత తానే చూసుకుంటూ వచ్చింది. కాగా కనికా గతేడాది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీలో ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో అలరించింది. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com