నటి రాగిణి ద్వివేదికి సుప్రీం కోర్టులో ఊరట

నటి రాగిణి ద్వివేదికి సుప్రీం కోర్టులో ఊరట
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ నటి రాగిణి ద్వివేదికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన కన్నడ నటి రాగిణి ద్వివేదికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనకు బెయిల్ నిరాకరిస్తూ కర్నాటక హైకోర్టు గత ఏడాది నవంబరు 3 న జారీ చేసిన ఉత్తర్వులను ఆమె అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాగిణి నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని, ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగానే ఆమెను అరెస్ట్ చేశారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో గతేడాది సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా సంజనా బెయిల్‌పై విడుదలైంది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాగిణి సుప్రీం కోర్టును ఆశ్రయించగా తాజాగా బెయిల్ లభించింది.

Tags

Read MoreRead Less
Next Story